#


Index

రామ యాథాత్మ్యము

మరొక విధంగా భావించటాని కవకాశమెక్కడిది. అయితే ఇంతవరకూ ఉదాహరిస్తూ వచ్చిన ఉదంతాల మాట ఏమిటి ? అవంతా రాముడి భగవత్తత్త్వాన్ని గాక మానవత్త్వాన్నే చాటుతున్నాయి గదా అని అడగవచ్చు.

  అదంతా అవిచారిత రమణీయమని మా సమాధానం. పూర్వాపరాలు కలియ బోసుకొని చక్కగా ఆకళించుకోక ఆపాతతః చూచి చేసే ఆక్షేపణలవన్నీ అలాకాక రామాయణ మహాకావ్యాన్ని ఆ మూలాగ్రము బాగా లోతుకు దిగి తడవి చూచామంటే అప్పుడర్ధమవుతుంది మనకు. కృష్ణుడెంత భగవదవతారమో రాముడూ అంతేనని. అంతేకాదు. కృష్ణుడికన్నా ఎక్కువ లీలామానుషుడు రాముడే లీలా విషయంలో ఆయనకన్నా ఈయన ఇంకా నాలుగాకులెక్కువ చదివినవాడే గాని తక్కువ చదివిన వాడు కాదు. అయితే తక్కువ వాడిలా కనిపిస్తాడు. అదే మోసం. అంతకన్నా ఎక్కువ మోసమిది. ఎందుచేతనంటే కృష్ణుడేలీల కూడా బయటపడి లోకానికి ప్రదర్శించాడు. తన వేషంలో తన భాషలో తన చేష్టలలో ప్రతి ఒక్క కదలికలో ఇతడు భగవంతుడని లోకుల కడుగడుగునా అర్థమయ్యేలాగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తించలేదు రాముడు. మనోవాక్కాయాలలో ఎక్కడా కూడా తాను భగవంతుడని ఎవరికిగానీ ఏ మాత్రమూ ఆచూకీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేను కూడా మీలాగే కేవలం మానవుడే నన్నట్టు వ్యవహరిస్తూ వచ్చాడు జీవితంలో. అది చూచి చుట్టూ ఉన్న బంధుమిత్రాదులంతా ఆయనను మానవ మాత్రుడేనని భ్రమిస్తూ వచ్చారు. వారితోపాటు రామాయణ పాఠకులమైన మనంకూడా ఈనాడు అలాగే భ్రాంతి పడుతున్నాము.

  అయితే ఇదంతా మన భ్రాంతేకాని కథానాయకుడైన రాముడికి లేదు. అంతకన్నా ఆ నాయకుణ్ణి తీర్చిదిద్దిన వాల్మీకి మహర్షికి లేదీ భ్రాంతి. వాల్మీకి రాముణ్ణి భగవంతుడని సంబోధించకపోవచ్చు. అలా వర్ణించకపోవచ్చు. పైకి వాచ్యంగా చెప్పలేదు. అంతమాత్రమే. వాచ్యంగా చెప్పకపోయినా ఆయన భగవత్తత్త్వాన్ని అడుగడుగునా మనకు ప్రతీయమానం చేస్తూనే వచ్చాడు తన రచనలో. కాకున్నా వాచ్యంగా చెబితేనే అయినట్టు కాకుంటే కానట్టు భావించరాదు ఏ విషయం గానీ లోకంలో. అసలు వాచ్యంగా చెబితే అది కవి నైపుణ్యానికి దీపకంగాదు లోపకమని కూడా చాటుతారు కావ్య విమర్శకులైన ఆలంకారికులు. రసపోషణ చేసే కవి ఇది శృంగారమిది వీరమిది కరుణమని స్వశబ్దంచేత దాన్ని వాచ్యంగా

Page 125

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు