#


Index

వర్ణనా సామరస్యము

మోహాన్నబుధ్యసే - ఒక కులమేగాదు, రూపమేగాదు, దాక్షిణ్యమే గాదు. దేనిలో చూచినా నాతో సరిపోతుందా ఆవిడ. నీవే చెప్పు. ఇంతకూ నిందలేనిది బొంది పోదన్నారు. సీత అనే వ్యక్తి నిమిత్తమయింది నీ మరణానికి. దూరా దుపాహృతః మృత్యుః సీత అనే మృత్యుదేవతను దూరం వెళ్లి కొనితెచ్చుకొన్నావు. ఇలా ఎంతో దూరం పలవిస్తుందా మానవతి. ఆ పలవించటంలో కూడా కేవల పామరత్వంలేదు. పామరత్వంతోపాటు ఎంతో నిగ్రహమూ, గాంభీర్యమూ, అభిమానమూ, నిర్లిప్తతా, వివేచనా శక్తి ఎంతో భావశబలత గోచరిస్తుంది. ఆలంకారికులు చెప్పే భావ శబలతకు ముమ్మూర్తులా ఇది ఉదాహరణ ప్రాయం. ఇలాంటి భావశబలత అసలు కిష్కింధలో వాలి మరణానంతరం తార చేసిన విలాపవర్ణనలోనే ఎంతగానో చూపాడు మహాకవి. యేనై కబాణేనహతః ప్రియోమే తేనైవమాంత్వం జహిసాయకేన త్వంవేత్థ యావద్వనితావిహీనః - ప్రాప్నోతిదుఃఖమ్ పురుషః కుమారః - స్త్రీ ఘాతదోషోనభవేత్తు మహ్యం ఆత్మేయమస్యేతిచ మాంజహిత్వం ఇలాంటి తార మాటలానాటి రాముడికేమోగాని ఈనాటికి మనకు కూడా హృదయ విదారకాలు. భావశబలతకు పెట్టిన పేరు తారావిలాపం.

  భావశబలత అన్నందుకు జ్ఞప్తికి వస్తున్నది. రామాయణం ఆమూలగ్రంగా చూస్తే ప్రపంచ మానవులకు కలిగే రసభావాలెన్ని ఉన్నవో అన్నిటికీ ఉదాహరణలు దొరుకుతాయి. అదీ అప్రయత్నంగానే. సహజంగానే. సుందరకాండలో రావణ రాక్షసాంగనల శృంగారం, మధువనంలో వానర క్రీడలలోని హాస్యం, తారా సీతామందోదరీ విలాపాలలోని కరుణం, ఖరాదులతో, రావణుడితో, జరిగిన పోరాటంలోని రౌద్రవీరాలు, విరాధ కబంధాది, శూర్పణఖాది ఘట్టాలలో బీభత్స భయానకాలు, మాయామృగ, సీతాహరణ, స్వయంప్రభా వృత్తాంతాలలోని అద్భుతమూ, ఋషివాటికలలోని శాంతమూ, సాహిత్య ప్రియంభావుకు లెన్నటికీ మరచిపోలేని మాణిక్యశకలాలు. అంతేకాదు. సీతలోని దైన్యమూ, హనుమంతుడిలోని ఉత్సాహమూ, సుగ్రీవుడిలోని భయమూ, రావణుడిలోని క్రోధమూ, కైకలోని క్రౌర్యమూ, భరతుడిలోని త్యాగమూ, విభీషణాదులలోని అనురాగమూ, ఏవంవిధ చిత్ర విచిత్ర భావాలు ఎక్కడెక్కడ ఎంత మనోహరంగా వర్ణితమయినవో అనుభవైక వేద్యమేగాని ఆవేద్యం కావు. కాకున్నా ఒక్కొక్క దాన్ని వివరిస్తూ పోతే ఒక్కొక్క

Page 117

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు