సాంఖ్య యోగము
భగవద్గీత
అలాగే వివరణ ఇచ్చారు భాష్యకారులు కూడా. మరి ఆత్మజ్ఞాన మందిస్తూ అందిస్తూ మధ్యలో అనాత్మ రూపమైన ధర్మాన్ని ఎందుకు ప్రస్తావించటమని ప్రశ్న వస్తుంది. వందకు వంద తెచ్చుకోలేక పోతే ఎనభయ్యో తొంభయ్యో మార్కులైనా తెచ్చుకోమని సలహా ఇచ్చినట్టు మోక్ష పురుషార్ధానికి ఎదగలేక పోయినా కనీసం నీధర్మమైనా నీవు పాటించు. దానికి కూడా తగిన ఫలముంటుందని ఇది ఒక ప్రరోచన Temptation అని గ్రహించాలి విమర్శకులు. అంతేగాని గీతా తాత్పర్య మిదే నని భ్రాంతి పడరాదు.
అథ చేత్ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి || 33 ||
కనుకనే చూడండి. ఈ బోధలో ఎక్కడబట్టినా ధర్మం స్వర్గం యుద్ధం - స్వధర్మం అనే మాటలే దొర్లుతుంటాయి గాని జ్ఞానం నిశ్రేయసం. - మోక్షమనే మాట ఎక్కడా రాదు. అందుకే ధార్మికమైన బోధ ఇది. తాత్త్వికమైన బోధ కాదు. అధచేత్త్వ మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. నేను నీకెంత నచ్చజెప్పినా ససేమిరా నేనీ యుద్ధం చేయనుగాక చేయనని మొండికి పడ్డావో దెబ్బతింటా వర్ణునా అని బెదిరిస్తాడు కృష్ణ భగవానుడు.
ఏమిటా దెబ్బ క్షత్రియుడికి విధించిన స్వధర్మాన్ని పాటించక పోవటమే గాదు. తతః స్వధర్మం కీర్తించ హిత్వా. లోకంలో నీకు కీర్తి ప్రతిష్ఠలు లేకుండా పోతాయి. అంతేగాక పాప మవా స్స్యసి. ఎక్కడ లేని పాపాన్నీ
Page 118