పూన్చిన మనోరథమనే రథమెక్కి కూచొని ఎప్పటికప్పుడు రాముడున్న దిశగా పరుగెత్తి పోతున్న దానిలా కనిపిస్తుందట. అంతేకాదు. ఇంకా పైకి పోయిందాయన భావ పరంపర. తాంస్కృతీమివసందిగ్ధామ్ - ఋద్ధిం నిపతితామివ - విహతా మివచశ్రద్ధా మాశాంప్రతిహతామివ - సోపసర్గాం యథాసిద్ధి- బుద్ధింసకలుషామివ అభూతేనాపవాదేన – కీర్తింనిపతితామివ అమ్నాయానా మయోగేన - విద్యామ్ ప్రశిథిలామివ – సంస్కారేణ యథా హీనాం వాచ మర్థాంతరం గతామ్ - సందిగ్ధమైన జ్ఞాపకశక్తిలాగా - పడిపోయిన సంపదలాగా - సడలిన శ్రద్ధలాగా - భగ్నమైన ఆశలాగా దెబ్బతిన్న సిద్ధిలాగా - కలుషితమైన బుద్ధిలాగా కనిపిస్తున్నదట. అభూతాపవాదంతో కళంకితమైన కీర్తి మాదిరుందట. సంప్రదాయానికి దూరమై శిథిలమైన విద్యలా ఉందట. ఆఖరుకు శబ్ద సంస్కారం కోలుపోయి ఒక అర్ధం చెప్పవలసిన శబ్దం మరొక అర్ధం చెబితే ఎలా ఉంటుందో అలా ఉందట. ఏమి భావాలివి. ఎంత ఎత్తైన భావాలు. మహర్షి తప్ప మరొకడెంత మహాకవి అయినా ఊహించగలడా చెప్పగలడా. కాళిదాసాదులు కూడా పుష్కలమైన ఈ ధాన్యరాశిలో చేతికి దొరికినన్ని గింజలేరుకొని పోయి పేరు గడించినవారే. కాకథా పునరన్యేషామ్ కవీనామ్.
మరి యుద్ధకాండలో మందోదరీ విలాప వర్ణన వింటారా ఎంత హృదయ విదారకంగా వర్ణించాడో. ఇంద్రియాణి పురాజిత్వా - జితంత్రి భువనంత్వయా స్మరద్భిరివత ద్వైర - మింద్రియైరేవ నిర్ణీతః ఇంద్రియాలను జయించాలని పూర్వం నీవు తపస్సు చేశావు. ఆ వైరంతో నిన్నా ఇంద్రియాలే ఇప్పుడు జయించాయని తోస్తుంది. క్రియతా మవిరోధశ్చ రాముడితో వైరమెందుకు నీకు వదిలేయమని ఎంత చెప్పినా వినలేదు. ఆ వినని దాని ఫలితమిది. అకస్మాచ్ఛాభికామోసి – మహా పతివ్రత ననవసరంగా కామించి తెచ్చావు. నీ ఐశ్వర్యమూ, నీ స్వజనమూ, నీ దేహమూకూడా దానితో దెబ్బతిన్నది. పొందాలనుకొన్న ఆ కామం పొందకుండానే చివరకామె పాతివ్రత్య తేజస్సుకు బలి అయిపోయావు గదా. అప్పుడే అసలెందుకు దగ్ధం కాలేదో నీవు నాకాశ్చర్యమే. ఎప్పటికైనా చేసిన పాపం కట్టి కుడుపకపోదు గదా. తెలియక పాడయిపోయావుగాని అంతకాన్న అందమైన కాంతలు లేరా నీకు. న కులేన న రూపేణ - నదాక్షిణ్యేన మైథిలీ మయాధికావాతుల్యాసా - త్వంతు
Page 116