కప్పబడిన హేమరేఖ - లక్ష్యంలో దిగబడిపోయిన బాణరేఖ. గాలిచే చెదరిపోయిన మేఘరేఖ. నాలుగుపమానాలు అప్పటి ఆ తల్లి కల్లోల పరిస్థితినే సూచిస్తున్నవనటంలో సందేహంలేదు. కాని అంత మాత్రమే గాదు. మరొక అద్భుతమైన భావంకూడా ఇమిడి ఉంది. సమష్టిరూపమే గాక ప్రత్యేకమైన పరిస్థితిని కూడా వర్ణిస్తున్న దీపద్యం. చంద్రరేఖ ఆమె ముఖానికి - హేమరేఖ శరీరానికి - బాణరేఖ దృష్టికి - మేఘరేఖ కేశపాశానికి ఉపమానాలుగా కనిపిస్తాయి. దానికి తగినట్టు అవ్యక్తాది విశేషణ పదాలు వాడటంలో కూడా విశేషం గోచరిస్తుంది. మబ్బుచాటు చంద్రుడి వలెనే ముఖం కూడా అవ్యక్తం. అంటే ఏ భావమూ స్పష్టంగా కనపడటం లేదా ముఖంలో శూన్యభావం తప్ప. మరి ప్రదిగ్ధ అనటంలో దుమ్మూ ధూళి బాగా పూసినదా శరీరమని అందుకే ఎంత సహజ లావణ్యమున్నా మరుగుపడి పోయిందని సూచిస్తున్నది. ప్రరూఢమనటంలో నాటుకొన్నదా చూపు. బాణంకూడా నాటుకొనేదే గదా. నాటిన తరువాత ఇక కదలదది. అలాగే చలనం లేనిదా చూపు కూడా. పోతే ప్రభిన్న అనటంలో మేఘమెలా చెదరిపోతుందో అలాగే చెదరిందావిడ జుట్టు. ఇలా మాటలు వాడటంలో కూడా ఎంత ప్రౌఢి ఉందో గ్రహించవచ్చు.
పోతే ఇక అశోకవనంలో కూడా శోకదేవతలా కూచున్న ఆ మూర్తిని చూడగానే హనుమంతుడి మనసులో మెదలిన భావాలు చూడండి ఎంత పరమాద్భుతంగా భాసిస్తున్నవో. సంఘాతమివ శోకానామ్ - దుఃఖ రాశులన్నీ ఒక చోట పోగయి నట్టుందట ఆ మూర్తి, దుఃఖస్యోర్మిమివోల్డితామ్ దుఃఖమనే ఒక పెద్ద తరంగంపైకి లేచి నట్టుందట. క్షీణపుణ్యామ్ తారామ్ భూమౌనిపతితామివ - పుణ్యమంతా ఖర్చయి పోయి దివి నుంచి భువికి జారిన ఒక తారకలా ఉందట. వర్షానంతరం శారదాభ్రములచేత ఆవృత అయిన చంద్రరేఖలాగ ఉందట. క్లిష్టరూపామ సంస్పర్శా దయుక్తామివ వల్లకీమ్ ఎవరూ తాకక వదిలేస్తే పలకని వీణలాగా ఉందట. లతా మకుసుమామివ - బోసిపోయిన శరీర యష్టి పూలు లేని తీగలాగ ఉందట. మృణాళీపంకదిగ్ధవ – విభాతినవిభాతిచ - ధూళి ధూసరమైన గాత్రంతో బురదలో పడి ఉన్న పద్మనాళం మాదిరుందట. పినద్దామ్ ధూమజాతేన శిఖామివ విభావసోః ధూమజాలం కప్పిన అగ్నిజ్వాల మాదిరుందట. సమీపం రాజసింహస్య - రామస్య విదితాత్మనః సంకల్ప హయసంయుక్తాః యాంతీమివమనో రథైః సంకల్పాలనే గుఱ్ఱాలు
Page 115