#


Index

వర్ణనా సామరస్యము

శరవృష్టిభిః ఇంద్రేణేవోత్తమం సస్యమా హతం త్వశ్మవృష్టిభిః మేఘం ధారాపాతంగా వర్షిస్తుంటే పైరు పడిపోయినట్టు బాణ వర్షానికి సైన్యం చాపకట్టుగా పడిపోవటమే నాకు కనిపిస్తున్నది. ఈ ఒక్కమాట చాలు ఎంత దారుణ సంగ్రామం జరిగిందో చెప్పటానికి. హనుమంతుడు అక్షకుమారుడితో చేసిన యుద్ధవర్ణనమంతా ఒక ఎత్తు. ఈ శ్లోకంలో చేసిన వర్ణన ఒక ఎత్తు. రరాస భూమిర్న తతావ భానుమాన్ వవౌనవా యుః ప్రచచాలచాచలః కపేః కుమారస్య చవీక్ష్యసంయుగం సనాదచద్యౌరుదధిశ్చచుక్షుభే నేల ఒరుసుకొని పోతున్నది. సూర్యుని ప్రకాశమే కనపడటంలేదు. గాలి కదలకుండా స్తంభించింది. చుట్టూ ఉన్న కొండలు కంపించి పోతున్నాయి. ఆకాశం శంఖంలా మ్రోగుతుంటే అర్ణవమంతా కలగుండు పడుతోంది. ఈ ప్రకారంగా ఎంతైనా చెప్పవచ్చు. ఏమైనా చెప్పవచ్చు. మనమేది కోరితే ఏది చెబితే బాగుండునని తోస్తే దానికంతా ఆస్కారముంది రామాయణంలో. ఆ అలంకారాలే అతివిలక్షణం. ఒక ఇష్టమైన చుట్టాన్ని దూరదేశం కొంతదూరం సాగనంపి వెనుకకు మరలిపోయే బాంధవుల మాదిరి ఉన్నాయట హనుమంతుడు లంకకు వెళ్లుతుంటే ఆయన ఊరు వేగానికి అనుసరించి వచ్చి అక్కడ నిలిచిపోయిన వృక్షగణాలు - అయిన వారెంత వద్దని వారిస్తున్నా ఇదుగో ఈ నీళ్లలో దూకి చస్తాననే గయ్యాళి స్త్రీలలాగా ఉన్నాయట ప్రవాహంమీది కొరిగిన చెట్లకొమ్మలు ప్రియుడెంత బ్రతిమాలినా వినకుండా ఒడిలో నుంచి క్రిందికి పరుగిడుతున్న ప్రణయ కలహాంతరితలలాగా ఉన్నాయట పర్వత సానువుల నుండి జాలువారే జలపాతాలు, ఇలాంటివి కొల్లలు కోకొల్లలు. సాహిత్య లోకానికే ఆలోకాన్ని ప్రసాదించే అమూల్యరత్న ప్రదీపాలు.

  పోతే బాహ్యప్రకృతి వర్ణనలే కాదు. ఆయా పాత్రల ప్రకృతిని వర్ణించిన వర్ణనలు కూడా కలకాలం మరపురానివి. ఒక సీతారాములరణ్యానికి వెళ్లే ఘట్టంగాని -వాలి అంతిమ యాత్రగాని - తారావిలాపమేగాని అశోకవనంలోని సీతాదేవి దీనదశగాని తుదకు రావణవధానంతరం మందోదరి చేసిన ఆక్రందనేగాని ఏ సన్నివేశం చూచినా అత్యద్భుతమే. అనన్యాదృశమే. అశోక వనంలో సీతనే తీసుకొని చూతాము. అవ్యక్త రేఖా మివచంద్రరేఖామ్- పాంసుప్రదిగ్గా మివహేమరేఖామ్ - క్షతప్రరూఢామివ బాణరేఖామ్-వాయుప్రభిన్నా మివ మేఘరేఖామ్. ఇలాంటి సీతను చూచాడట హనుమంతుడు. ఎలాంటి సీత ఆవిడ. అవ్యక్తరేఖ అయిన చంద్రరేఖ. ధూళిచే

Page 114

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు