ఒక స్త్రీ పుష్పమాలిక లాగా ఉందని వర్ణిస్తాడు అంతేకాదు. సోపశ్యచ్ఛా తకుంభాని–పాత్రాణి పానకుంభాని హైమ. రాజత- మణిమయాదులెన్నో ఉన్నాయట. అవి క్వచిదర్ధావశేషాణి - క్వచిత్పీతాని సర్వశః - క్వచిన్నైవప్రపీతాని - కొన్ని సగం త్రాగినవి. కొన్ని పూర్తిగా త్రాగినవి. కొన్ని అసలే త్రాగనివి. అలాంటి దృశ్యాలన్నీ చూచిన తరువాత హనుమంతుడు మనసులో అనుకొంటాడు. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలుమమాత్యర్థం - ధర్మలోపం కరిష్యతి - నిద్రిస్తూ ఉన్న పరస్త్రీలను చూడటం నాకు ధర్మమేనా. అయినా నా దృష్టివారిని పరకాయించి చూడటం లేదుగదా. నచమే మనసః కించి ద్వైకృత్య ముపపద్యతే నా మనసుకెలాంటి కామ వికారమూ కలగడం లేదుకూడా. మనోహి హేతుస్సర్వత్ర. మంచిగాని చెడ్డగాని ఏ విషయంలోకూడా మనసేగదా ప్రమాణం. అది నిర్మలంగా నిశ్చలంగా ఉన్నంతవరకూ నాకేమి భయమని సమాధానం చెప్పుకొంటాడు. అసలీ శృంగార సన్నివేశమింతగా వర్ణించటం కూడా ఇందుకేనేమో. హనుమత్పాత్ర ఉదాత్తస్వభావ చిత్రణం కోసమేనని తోస్తుంది. అంతేకాదు. రావణుడి కామపరతంత్రత ఎలాంటిదో కన్నులకు కట్టినట్టు చూపి కనుకనే అంత బహుశ్రుతుడూ తపస్సంపన్నుడయి కూడా చివరకు వినిపాతాన్నే కోరి తెచ్చుకొన్నాడని ధ్వనింప జేయటం కోసమైనా కావచ్చు నీ సుదీర్ఘ శృంగార వర్ణన. 링
ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రకృతి వర్ణనలు. ఒక వివాహమే గాదు. యుద్ధమే కాదు. వన విహారాదులేకాదు. ఎన్నో ఉన్నాయి. అన్నింటికీ సంగమస్థానమే రామాయణ కావ్యం. అప్రయత్నంగానే వర్ణించే అవకాశముంది వాటన్నిటినీ. ఒక యుద్ధవర్ణన చూడాలంటే ఒక కాండ కాండా అదే. చిత్ర చిచిత్రంగా సాగిన ఆ యుద్ధాన్ని ఎంత అద్భుతంగానో వర్ణించాడు కవి. అది మరలా వర్ణించాలంటే మరలా మనమొక వాల్మీకి కావాలి. ఇంతెందుకు. ఖరదూషణాదులతో రాముడు చేసిన యుద్ధం చాలు. శూర్పణఖ ఆ జరిగిన విషయమంతా రావణుడికి వర్ణించి చెబుతూ ఇలా అంటుందొక మాట. నాదదానమ్ శరాస్ ఘోరాస్ సముంచంతం శిలీముఖాస్ - నకార్ముకం వికర్షంతం - రామం పశ్యామి సంయుగే- రాముడు పొదిలోనుంచి బాణాలు తీస్తున్నట్టు వాటిని వదలుతున్నట్టు - ధనుస్సు లాగుతున్నట్టు నాకు కనిపించనే లేదు. మరేమి కనిపిస్తుందంటే హన్యమానంతు తత్సైన్యం పశ్యామి
Page 113