సాంఖ్య యోగము
భగవద్గీత
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన-
-మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || 29 ||
దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 30 ||
అయితే ఆ స్థితి నందుకోట మంత సులభం కాదు. క్రొత్తగా అందుకొనేది గాదు. ఇంతకుముందే అందుకొని ఉన్నాము కూడా. అయినా గుర్తింపు లేక బ్రతుకుతున్నాము. అందుకే ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేనమ్ ఆత్మను గురించి శాస్త్రం చెబుతున్నా గురువులు బోధిస్తున్నా ఏమి చెబుతున్నారో ఉన్నదున్నట్టు పట్టుకోలేక ఆశ్చర్యంగా చూస్తుంటాడొకడు. ఇంతకు ముందెప్పుడూ చూడని దొక్కసారిగా చూస్తే అది ఆశ్చర్యం. చూస్తున్న నీవే సుమా అది అని చెప్పే మాట వింటే మరీ ఆశ్చర్యం.
అలాగే ఆశ్చర్య వ ద్వదతి. ఇంతవరకూ నేనెప్పుడూ విన్నదిగాదు. ఇవాళ ఆయనగారు దాన్ని గూర్చి బోధిస్తుంటే ఏమిటా అది అని ఆశ్చర్యం వేస్తున్నదని చెబుతుంటా డింకొకడు. అంతేకాదు. ఆశ్చర్యవ చ్చెన మన్యః శృణోతి. గురువుగారది ఆశ్చర్యంగా చూచి చెబుతుంటే శిష్యుడంతకన్నా అది ఆశ్చర్యపడి వింటుంటాడు. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎంత వింటున్నా కూడా ఉన్నదున్నట్టు ఆత్మ స్వరూపాన్ని పట్టుకోలేడు వేరొకడు. ఇంతకూ చూచినా చెప్పినా విన్నా అది అసలైన ఆత్మ కాదు. చూడటం చెప్పటం వినటం ఇవన్నీ ఇంద్రియ వ్యాపారాలు. గ్రహించటం
Page 112