సాంఖ్య యోగము
భగవద్గీత
కనుకనే ఇలాటి అవ్యక్తమే నాకు ఆది ఇదే నాకు అంతమని భావిస్తున్నాడు యావజ్జీవమూ ప్రతి ఒక్క మానవుడూ. ఇది మనకందరికీ ఇప్పుడు స్వానుభవ సిద్ధమే గదా. నీవెక్కడి నుంచి వచ్చావని అడిగితే ఎవడైనా ఏమి చెబుతాడు. మళ్లీ ఎక్కడికి నీ ప్రయాణమంటే ఏమి చెబుతాడు. అవి రెండూ రెండు ఇనుప తెరలలాగా పడిపోయాయి. మన దృష్టి కేమాత్రమూ దారి ఇవ్వటం లేదు. ఒక నిద్రలోకి ఎలా వచ్చామో తిరిగి ఆ నిద్రలోనుంచి జాగ్రత్తులోకి ఎలా వస్తున్నామో జ్ఞప్తి ఉందా నీకు తెలియకుండానే పడుతుంది నిద్ర. తెలియకుండానే విడిపోతుంది. అలాగే ఈ దీర్ఘకాలికమైన నిద్ర కూడా. మహాసుషుప్తి అని పేరు పెట్టారంటే భగవత్పాదులు నిజంగా మహాసుషుప్తే ఇది. అందుకే స్వరూప జ్ఞానం లేదన్నారాయన. జ్ఞానముంటే నిద్ర ఎలా పడుతుంది. నిద్ర పడితే జ్ఞానమెలా ఉంటుంది. ఇది జీవుడికే ఎందు కేర్పడిందంటే వీడికున్న జ్ఞానం విశేష జ్ఞానమే గాని Relative సామాన్య Absolute జ్ఞానం కాకపోవటం వల్ల ఇది ఇలా మనలను వెంటాడుతున్నంత వరకూ తత్ర కా పరిదేవనా. ఆ క్రందనం చేసి ప్రయోజనం లేదు. జీవాత్మ భావం ప్రత్యగాత్మ భావానికి ఎదగ గలిగినప్పుడే పరిదేవనకు పూర్తి పరిష్కారం. అప్పు డవ్యక్తంలో నుంచి వచ్చా మనుకోము. అందులోనే వెళ్లి కలుస్తున్నా మనుకోము. అజమూ అమరమైన ఆత్మ స్థితిలో ఎప్పుడూ ఉన్నామనే ప్రజ్ఞతోనే ఉండిపోగలం.
Page 111