రామదూత అయిన ఆ మారుతిని చల్లని తన కిరణాలతో సేద దీరుస్తున్నాడట. ఇలా కథా పాత్రాదుల ప్రవృత్తితో ముడిపడి ఉందా వర్ణన అంతా.
పోతే మధుపాన రతిక్రీడాదులని చెప్పే కావ్య వర్ణనలు కూడా దొర్లాయి రామాయణంలో. అలాంటి అవకాశం కథావస్తువులోనే ఏర్పడుతుంది. హనుమంతుడు రావణాంతః పురంలో సీతను వెతుకుతూ సంచరిస్తుంటాడు. అది రాత్రి సమయం. అక్కడ ఉన్నవారంతా రాక్షస స్త్రీలే. రావణావరోధ జనమే. పైగా రాత్రి కాలం కావటం మూలాన రాక్షసాంగనలు కావటంమూలాన బాగా తాగి ఆడిపాడి అలసి సొలసి పడి ఉన్నారెక్కడి వారక్కడ. ఇది మంచి అవకాశమిచ్చింది కవి వర్ణనకు. ఇది మరొక విధంగా కూడా సాభిప్రాయమే. ఎలాగంటే హనుమంతుడు బ్రహ్మచారి. పైగా రామకార్యార్థం వచ్చాడు. తిరుగుతున్నాడు. అప్పటి పరిస్థితిని బట్టి ఇలాంటి శృంగార వర్ణన పనికిరాదు. అయినా చేయక తప్పదు. కారణం అతడన్నిచోట్లా చూచి తీరాలి. అందరిలో సీత ఎక్కడుందో వెతికి తీరాలి. మరి వర్ణించకపోతే ఎలాగ. అలా వారంతా అంత కామోద్దీపకంగా కనిపిస్తున్నా అతడి మనసు చలించలేదని కార్యదీక్ష సడలలేదని చూపటంకూడా ఇందులో గూఢంగా ఇమిడి ఉన్న ఒక భావం. మరి అనితర కవి సాధారణమైన ఆ వర్ణన ఇలాగలాగని వర్ణించేదికాదు. ఎవరికి వారు చదివి ఆనందించవలసిందే మచ్చుకు రెండు మూడు ఉదాహరిస్తాను. ఆలకించండి. కాచిద్వీణాంపరిష్వజ్య ప్రసుప్తాసంప్రకాశతే మహానదీప్రకీర్ణేవ నళినీ పోతామాశ్రితా వీణాదండాన్ని కౌగిలించుకొని ఒక లతాంగి అలాగే పడుకొంటే అది ఒక నదీజలంలో తేలుతూ వచ్చిన పద్మనాళం పడవను తాకినట్టుందట. అన్యాకక్షగతేనైవ మడ్డుకేనాసి తేక్షణా ప్రసుప్తాభామినీభాతి బాలపుత్రీవ వత్సలా చంకలో దాచుకొన్న మడ్డుకంతోనే ఒకతి పడిపోతే అది చంటి బిడ్డను పట్టుకొని పడుకొన్న దానిలాగా ఉందట. కలశీమపవిధ్యాస్యా ప్రసుప్తాభాతి భామినీ-వసంతే పుష్పశబలా - మాలేవపరిమార్జితా - మధుపానంచేసి ఒకతి ఆ మధుకలశాన్నే మీద వేసుకొని పడిపోయింది. దాని వస్త్రమంతా మదిరారసంతో తడిసి నీరు ఒడుస్తుంటే వేసవి కాలంలో నీళ్లలో ముంచి పైకి వేలగట్టిన ఒక పూలదండలాగా ఉందట. మరి ఆ స్త్రీలంతా ఒకరి చేతులపై ఒకరు చేయి వేసుకొని వరుసగా పడుకొంటే తొడిమ తొడిమా దగ్గర చేర్చి కట్టిన స్త్రీ మాలాగ్రథితాహిసా
Page 112