అయినా తన హృదయానికి తగిలిన గాయం మానుతుందా అది మానేదేనా ఆ గాయం. మానదనే చెబుతున్న దాకాశాన్ని తిలకిస్తే సంధ్యారాగోతైతై సామ్ర రంతేష్వధికపాండురైః స్నిగ్ధరభ్రపటచ్ఛేదై - ర్బద్ధప్రణమివాంబరమ్ - సంధ్యారాగమే గూడుగట్టిన నెత్తురు. మెత్తమెత్తని తెల్లని మబ్బుతునకలనే బట్టలెన్ని చించి కట్టినా ఆకాశమనే రసికుడి కేర్పడిన వ్రణం మాటుపడకుండా పైకి కనిపిస్తూనే ఉంది. నడుమ ఎర్రగా కొసలలో తెల్లగా కనపడే మబ్బుతునకలే దానికి తార్కాణమట. ఇది ఆకాశం కథ ఏమోగాని ఆత్మారాముడి కథ అనటంలో సందేహంలేదు. ఇంతలో కొంత తేరుకొని చూస్తాడు. చుట్టూ దూరాన ఎత్తైన కొండలు, కొండలపైన మంచి పరిమళ పుష్పాలు. ధనధనమని క్రిందికి దూకే సెలయేటి జాలులు, అవన్నీ చూస్తే సుగ్రీవ ఇవశాంతారి ర్థారాభిరభిషిచ్యతే తన మిత్రుడు సుగ్రీవుడు అభిషేకం చేసుకొంటున్న దృశ్యం కనిపిస్తున్నది కంటికి. అంతేకాదు. తన చిన్నప్పటి గురుకుల వాసరూపంకూడా స్మరణకు వస్తున్నది. మేఘకృష్ణాజినధరా - ధారా యజ్ఞోపవీతినః మారుతాపూరితగుహాః ప్రాధీతా ఇవపర్వతాః మేఘాలనే కృష్ణాజినాలు ధరించి సెలయేళ్లనే యజ్ఞోపవీతాలు మెడలో వేసుకొని హోరుమనే మారుతం గుహలలో ప్రవేశిస్తుంటే ఉదాత్తాను దాత్తాలతో పర్వతాలు వేదం పఠిస్తున్నాయట. ఎంత పావనోదార రమణీయమైన భావనో చూడండి ఇది. ఇంతలో ఉన్నట్టుండి ఒక మెరుపు మెరిసింది మేఘమండలంలో చూచేలోపలే మరలా మాయమైంది. అది రావణుడి ఒడిలో సీతలాగానే ఉండీ లేనట్టే తోచిందాయన కళ్లకు. కళాభిరవహైమీభి - ర్విద్యుద్భి రభితాడితమ్ సవేదన మివాంబరమ్ మాటిమాటికి కనిపించే ఆ మెరుపు తీగలు మేఘమండలాన్ని కసితో మోదుతున్న కశలలాగా కనిపిస్తున్నాయి. అవి మేఘమండలాన్ని కాదు. మేఘమండలంలాగా చీకట్లు క్రమ్మిన తన హృదయ మండలాన్నే మనోనేత్రానికి దృశ్యాదృశ్యంగా గోచరించే సీత శరీర విద్యుల్లతలే అలాపట్టి బాధిస్తున్నవి.
సరే చివరకెలాగో గడిపాడా కాళరాత్రులలాంటి వర్షరాత్రులు తనకు కాకపోయినా లోకానికంతా ఉపకారం చేసి వెళ్లిపోయిన ఓ ఉదాత్త చరిత్రులలా భాసించాయి మేఘపంక్తులా పాంక్తిరథికి రాముడికి. లోకం సువృష్ట్యా పరితోషయిత్వా నదీస్తటాకానిచ పూరయిత్వా నిష్పన్నసస్యాం పసుధాంచకృత్వా- త్యక్త్వానభస్తోయధరాః
Page 109