#


Index

వర్ణనా సామరస్యము

మాంహిపల్లవతామ్రార్చిః వసంతాగ్నిః ప్రధక్ష్యతి చిగుళ్లనే మంటలతో వసంతమనే అనలం నన్ను దహించి వేస్తున్నదంటాడు.

  అంతేగాదు, ఎదుట తిరుగుతున్న మృగదంపతులనూ, పక్షి దంపతులనూ చూస్తుంటే ఎంతో అసూయగా కూడా ఉందా మహాత్ముడికి. పశ్యలక్ష్మణ నృత్యంతమ్ మయూర ముపనృత్యతి శిఖనీ మన్మథార్తెషాతామేవ మనసారామాం మయూరో ప్యుపథావతి – వితత్యరుచిరౌ పక్షౌ రుతై రుపహసన్నివ మగ నెమలి ఆడుతుంటే ఆడదీ ఆడుతున్నది. ఆడదానిని మగ నెమలి పురివిప్పుకొని వెంటబడుతున్నది. మయూరస్యవనే నూనం రక్షసా నహృతాప్రియా - బహూశా దీని భార్యనే రాక్షసుడూ అపహరించుకొని పోలేదు. అందుకే యధేచ్ఛగా విహరిస్తున్నది. పశ్య లక్ష్మణ సంరాగంతిర్యగ్యోని గతేష్వపి చూడు లక్ష్మణా తిర్యక్కులలో కూడా ఎంత అనురాగమున్నదో. అందుకే ఒకదాని నొకటి అంతగా వెంబడిస్తున్నాయి. మమాప్యేవం విశాలాక్షీ జానకీ జాత సంభ్రమా- మదనేనాభివరేత్త యదినా పహృతాభవేత్- నా జానకి కూడా మదన పారవశ్యంతో నాకెదురు వచ్చేది గదా ! రాక్షసుడే అపహరించకపోతే. చూడు హృష్టః ప్రవద మానశ్చమా మాహ్వయతి కోకిలః ఆనందంతో పొంగిపోతూ నన్నుచూచి కేకలేస్తున్నదా కోకిల. శకునాస్సంఘశః కలం - ఆహ్వయంత ఇవాన్యోన్యం కామోన్మాదకరా మమ. పక్షులన్నీ జంటలుగా చేరి ఒకదానితో ఒకటి కేరింతలాడుతూ నాకు కామాన్ని రెచ్చగొడుతున్నాయి. చెట్లు కూడా స్తబకైః పవనోతి ప్రైః తర్జయంత ఇవ గాలికి కదిలే పూలగుత్తులతో చేతులెత్తి నన్ను బెదిరిస్తున్నాయి. అయినా ఒక పనిచేస్తే సరిపోతుందేమో. ఏషవై తత్రవైదేహ్యా విహగః ప్రతిహారకః పక్షీ మాంతు విశాలాక్ష్యాః సమీపమునేష్యతి ఈ వాయసం ఏమో బ్రహ్మండంగా అరుస్తున్నది. దీనిమీద ఎక్కిపోతే ఇది నన్ను నా ప్రియురాలి దగ్గర చేరుస్తుందేమో చూతామా ? అని వెర్రివాడిలా వాపోతాడు. పైగా పద్మకోశ ఫలాశాలు చూస్తే అతనికి సీత నేత్రకోశాలే కనిపిస్తున్నాయి. వృక్షాంతర వినిస్సృతమైన సుగంధ మారుతం చూస్తే సీత సుగంధి నిశ్శ్వాసమే తలపుకు వస్తున్నది. పుష్పితమైన కర్ణికార యష్టిని చూస్తే సీత శరీర యష్టినే స్మరణకు తెస్తున్నది. ఏమి చేస్తాడు పాపమా మానవుడు. యదిదృశ్యేత సాసాధ్వీ - యదిచేహవసేమహి - ఆమె కనిపిస్తే అక్కడే ఇద్దరమూ కలిసి ఉంటే స్పృహయేయమ్ నశక్రాయ నాయోధ్యయై అయోధ్య

Page 107

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు