#


Index

వర్ణనా సామరస్యము

  రవి సంక్రాంత సౌభాగ్య - స్తుషారావృతమండలః నిశ్శ్వాసాంధఇవాదర్శ శ్చంద్రమాన ప్రకాశతే. హేమంతంలో చంద్రుడి శోభ అంతా సూర్యుడిలో సంక్రమించిందట. అంటే చల్లని చంద్రుడికంటే వెచ్చని సూర్యుడే కావలసి వచ్చాడు లోకానికి. దానికితోడు చంద్రుడు మంచుచేత కప్పబడి అసలు కనపడటమే అరుదయింది. ఎలా ఉందంటే చంద్రమండలం, ఆవిరిచేత గ్రుడ్డిదయి పోయిన అద్దంలా ఉందట. ఏమి సహజ రమణీయమైన వర్ణనమిది. అంతేకాదు. లోతుకు దిగి చూస్తే ఇది చంద్రవర్ణనా రామచంద్ర వర్ణనా ఏదైనా కావచ్చునని తోస్తున్నది. రవి వంశంలో జనించిన రాముడు జ్యేష్ఠుడయి కూడా పట్టాభిషేకానికి నోచుకోక ఆ రవి వంశానికి తన వైభవాన్ని ఒప్పజెప్పి వచ్చాడు. అడవులలో తుషారావృతుడిలాగా ధూళి ధూసరిత దేహుడై అజ్ఞాతవాసమే చేస్తున్నాడు. సహజమైన తన ప్రకాశమే మరుగుపడి పోయింది. మరుగు పడిందని చెప్పటం మూలాన అవధి తీరితే మరలా పూర్వవైభవాన్ని పొందుతాడనే సూచన కూడా ఉంది ఇందులో. మరి రాముడి దశ ఇలా ఉంటే సీత పరిస్థితి ఎలా ఉంది. అదికూడా ధ్వనింపజేస్తున్నాడు మరొక శ్లోకంలో. ధ్వని ఏమి వచ్చె. వాచ్యంగానే చెబుతున్నాడు. జ్యోత్స్నాతుషారమలినా పౌర్ణమాస్యాం నరాజతే - సీతే వచాతపశ్యమా లక్ష్యతే నతుశోభతే- రాముడు చంద్రుడైతే సీత చంద్రికగాక తప్పదుగదా. చంద్రిక ఇప్పుడెలా ఉంది. చంద్రుడి లాగానే మంచుపొర గప్పి మలీమస అయి కనిపిస్తుంది. కనిపిస్తున్నదేగాని కళకళలాడటం లేదంటాడు. అంతేకాదు. భరతుడయోధ్యలో ఉండికూడా జటాధారియై అతికఠోరవ్రతుడై ఈ ఋతువులో ఎంత కష్టపడుతున్నాడో అని వాపోతాడు లక్ష్మణుడు. దీనినిబట్టి సీతా రాములరణ్యంలో ఉండి ఎంత బాధపడుతున్నారో వారి దశ చూస్తూ తానెంత మనసులో పరితపిస్తున్నాడో అదికూడా అతని మాటలలో మన మూహించుకోవలసి ఉంది.

  ఇక ఈ రెండు శ్లోకాలూ చూడండి. స్పృశంస్తు విపులం శీత ముదకం ద్విరదస్సుఖం అత్యంతతృషితో వన్యః ప్రతిసంహరతే కరమ్ నీరు త్రాగాలని ఎంతో ఆతురతతో వచ్చి కూడా త్రాగలేక గజపతి తన తొండాన్ని వెనక్కు తీసుకొంటుంది. ఈ గజపతి వ్యవహారంలో మనకు భరతుడు కనిపిస్తున్నాడు. రాముడి అభిషేకోత్సవం చూడాలని పరుగెత్తుకు వచ్చాడయోధ్యకు. కాని దానికి బదులు తన అభిషేకమే

Page 104

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు