సాంఖ్య యోగము
భగవద్గీత
ఎప్పుడూ జనన మరణా లనుభవిస్తూనే ఉన్నావు నీవు. ఇక ఏమయిపోతానో అని శోకాండాలు పెట్టటం దేనికి Method in Mad-ness ఇలా భావించినా స్తిమితంగా ఉండవచ్చు గదా మానవుడు.
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి || 27 ||
జాతస్యహి ధ్రువో మృత్యుః - పుట్టిన ప్రతివాడూ ఎప్పటికైనా పోవలసిందే తప్పదు. అలాగే ధ్రువం జన్మ మృతస్యచ. పోయినవాడు కూడా మరలా పుట్టవలసిందే. అదీ తప్పదు. ఇది ఒక చక్రం. సంసార చక్రం. చక్రం తిరిగి నట్టు తిరుగుతూనే ఉంటుంది. అందుకే సంసారమని కూడా అన్నారు దీన్ని. సంసరతీతి సంసారః - అవిచ్ఛిన్నంగా ఎప్పుడూ సాగిపోయే దని అర్ధం. జననం తరువాత మరణం మరణం తరువాత జనన మన్నప్పుడది సంసారంగాక మరేమిటి చక్రంలాంటి దనిగదా చెప్పాము. చక్రం తిరుగుతుంటే క్రిందిది పైకి పైది క్రిందికీ రాక తప్పదు. క్రిందిది పైకి వస్తే జన్మ. పైది క్రిందికి పోతే మరణ మనుకొంటే సరిపోతుంది. ఒక రంగులరాట్న మెక్కి కూచుంటే వాడు తిప్పుతూ ఉంటాడు మనలను. మనం కండ్లు తిరగకుండా కూచోవాలే గాని బయలుదేరిన చోటికే వస్తుంటాము మరలా.
అలాగే పుడుతున్నాము. పోతున్నాము. మరలా పుడుతున్నాము ఇక భయమేముంది. తస్మా దపరిహార్యేర్దే. అనివార్యంగా జరుగుతూ
Page 105