#


Index

వర్ణనా సామరస్యము

ఆ సంరంభానికి తగినట్టే ఉంది మహేంద్ర పర్వత వర్ణన. వృతంనానా విధైర్వృక్షై ర్మృగసేవితశాద్వలమ్ మత్తద్విజగణోద్ధుష్టం - సలిలో త్పీడసంకులం పాదాభ్యాం పీడితస్తేన – రరాప సింహాభిహతో - మహాన్మత్త ఇవద్విపః ముమోచ సలిలోత్పీడాన్ విప్రకీర్ణశిలోచ్చయః విత్రస్త మృగమాతంగః - ప్రకమ్పిత మహాద్రుమః నానాగంధర్వ మిధునైః పానసంసర్గకర్కశైః ఉత్పతద్భిశ్చవిహగైః విద్యాధరగణైరపి త్యజ్యమాన మహాసానుః సీదన్ మహతి కాంతారే సార్థహీన ఇవాథ్వగః - భుజంగై రర్ధనిస్సృతై స్సపతాక ఇవాభాతి ఇలా ఎంతో సంక్షుభితమైన దానిభౌతిక రూపాన్ని బయట పెడతాడు. అదే ఆ హనుమంతుడు తిరిగి వచ్చేటపుడెక్కిన ఆరిష్టమనే పర్వతాన్ని చూడండాయన ఎలా వర్ణించాడో ? ఇది ఆధి భౌతికమైతే అది ఆధ్యాత్మికంగా సాగిందా వర్ణన. తుంగపద్మక జుష్టాభి - ర్నీలాభిర్వనరాజిభి స్సోత్తరీయ మివాంభోదై - శృంగాంతర విలంబిభిః శృంగముల మీద వ్రేలాడే నల్లని మేఘాలు ఆ పర్వతరాజు కప్పుకొన్న ఉత్తరీయాలలాగా ఉన్నాయట. బోధ్యమాన మివ ప్రీత్యా - దివాకర కరైశ్శుభైః సూర్యుడు తనచేతులతో తట్టి లేపుతున్నట్టుందట పర్వతాన్ని. ఉన్ని షంతమివోద్దూతై - ర్లోచనై రివధాతుభిః తళతళమనే సిందూరాది ధాతువుల మిషతో పర్వతం కళ్లు తెరుస్తున్నదట. దేవదారుభిరత్యుచ్చై - రూర్ధ్వబాహుమివస్థితమ్ ఎత్తుగా ఏపుగా పెరిగిన దేవదారువులా పర్వతం పైకెత్తిన బాహువులట. ప్రపాతజల నిర్దోషైః ప్రాక్రుష్టమివ. ధనధనమని ప్రవహించే జలపాతాలు చూస్తే పర్వతం పెద్దగా కేకలు పెడుతున్నదట. వేపమానమివశ్యామైః కంపమానైశ్శరచనైః తెల్లని మబ్బులు పైన కదులుతూ పోతుంటే పర్వతం వార్ధక్యంతో తలవణికిస్తున్నదట. నిశ్శ్వసంతమివామర్షా - దోరై - రాశీవిషోత్తమైః భయంకరమైన విషసర్పాలు బుసలు కొడుతుంటే పర్వతం నిశ్శ్వసిస్తుంది. నీహారకృత గంభీరై ర్ధ్యాయంతమివగహ్వరైః పొగమంచు కప్పిన గుహలతో కళ్లు మూసుకొని ధ్యానం చేస్తున్నది. మేఘపాదనిభైః పాదైః ప్రక్రాంత మివ పర్వతః చుట్టూ వ్యాపించిన పాదాలతో నడచిపోతున్నదట. జృంభమాణ మివాకాశే శిఖరైర భ్రశాలిభిః పైకి ఉవ్వెత్తుగా లేచిన శిఖరాలతో పెద్దగా ఆవులిస్తున్నదట. ఏమిటీ వర్ణన. ఇంత అద్భుతమైన అతిలోకమైన హృదయంగమమైన అతి సహజమైన వర్ణన సాహిత్యంలో మరెక్కడా కనపడదు. అది పర్వతమా ? పర్వతవేషంలో కనిపించే ఒక మహాపురుషుడా అలాగే కనిపించాడు మహర్షికి.

Page 101

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు