అదేదో గాదు. ప్రతిదీ ఉంది ఉందనే స్ఫురణ. ఇలాంటి
జ్ఞానం మనసులో ఎప్పుడూ ఏమరకుండా ఉంటే చాలు.
మనసా వాచా కాయేన నీవే పని చేసినా పరవాలేదు. -
అసలు నీ స్వధర్మం నీవు మానుకోనక్కరలేదు. ఏది చేసినా
ఒకానొక సమష్టి చైతన్యం వెలుగులోనే ఇది నడుస్తూ ఉంది.
నేను కేవలం దానికొక ప్రణాళిక Medium మాత్రమే నని
భావిస్తూ పోతే చాలు. అది నీ బుద్ధిని శుద్ధి చేస్తుంది -
ఏకాగ్రత కల్పిస్తుంది. ఇదే జ్ఞాన మార్గం. ఇది కాక మంత్ర
తంత్రయోగా భ్యాసాదు లేవి పెట్టుకొన్నా అవి కేవలం ప్రయాసే
ఫలితమివ్వవు. దీనికే అనన్యభక్తి అనన్య ధ్యానమని -
కూడా పేరు. ఒక దివ్య శక్తే నాలోనూ నేను చూచే సమస్త
భూతాలలోనూ చేరి అన్నీ నడిపిస్తున్నదనే జ్ఞానం కన్నా
గొప్ప భావన ఏముంది - అదే జీవితంలో శాంతి - జీవితా
నంతరం మోక్షాన్నీ ప్రసాదిస్తుంది.
ఇంతకూ ఒక్క మాట చివరిసారిగా తెగేసి చెబుతున్నది
సర్వధర్మాన్ పరిత్యజ్య - మామేకం శరణం వ్రజ
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయి ష్యామి మా శుచః
సచ్చిద్రూపమైన ఆత్మే సర్వ వ్యాపకం. సర్వ స్వరూపం. దాని విశేషాలే నామ రూపాలు. అవి ఏవో గావు దాని
Page 64