ధర్మాలే అంటే లక్షణాలే. వాటిని గాదు మనం చూడవలసింది. అవి దేని లక్షణాలో ఆ మూలతత్త్వాన్ని పట్టుకోవాలి. పట్టుకొని అదే గదా ఇవి అని వీటిని దానిలో ఎప్పటికప్పుడు లయం చేసుకోవాలి. అంటే వీటిని ఆ రూపంగా చూస్తూ పోవాలి. బంగారమంటే ఏమిటో గుర్తించి అదే గదా ఈ కంటెలు కాసుల దండలనే సొమ్ములన్నీ అని ఆరూపంగానే వీటిని చూచినట్టు చూడాలి. అప్పుడా నేననే జ్ఞానం అఖండంగా దర్శనమిస్తుంది. అది కేవల జ్ఞాన స్వరూపం కాబట్టి అవిద్యా కామ కర్మలనే త్రివిధ పాపాలనుంచీ మానవుడికి ముక్తి లభిస్తుంది. సంసారంలో పడగొట్టేదేదో అది పాపం. పాతకం. పరిపూర్ణ జ్ఞానం లభిస్తే ఇక అజ్ఞానమే లేదు కాబట్టి దానితోపాటు కామకర్మలనే పాపాలు కూడా ఎగిరిపోక తప్పదు. పోతే సంసార బంధమనే సమస్య ఏముంది.
Page 65