#


Index

ప్రస్థానత్రయ సారము

  ఇలా ఏది పరచుకొని సర్వ పదార్థాలలోనూ కనిపిస్తుంటుందో అది సామాన్యం Universal. ఆభరణాలలో బంగారంలాగా. పోతే అది వేటి లోపలా వెలపలా వ్యాపించి ఉందో అవి విశేషాలు. సామాన్య మన్నిటినీ వ్యాపించినట్టు విశేషాలు వ్యాపించలేవు. కాని రెండూ ఎప్పుడూ ఎక్కడబడితే అక్కడ కలిసే ఉంటాయి. కలిసి ఉన్నా మన మాయా విశేషాలతోనే సంబంధం పెట్టుకొంటాము గాని అక్కడే ఉన్న సామాన్యంతో పెట్టుకోము. కారణమేమంటే దృశ్య ప్రపంచంలాగా మన దృష్టి కూడా విశేషమే అయి కూచుంది. అందుకే మనమీ శరీరమనః ప్రాణాలనే విశేషాలే నేనని అభిమానించాము. ఆ దృష్టి వదలకుండానే భార్యా పుత్రులనూ వస్తు వాహనాలనూ విశేషాలుగానే చూస్తుంటాము. ఈ విశేష దృష్టి వదలుకోనంత వరకూ మానవుడికి మోక్షం లేదు.

  ఒక యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి చేశాడన్నా ఇదే బోధ. ఆ యాజ్ఞవల్క్యుడే జనక మహారాజు సభలో గార్గి మొదలైన వారికి చేశాడన్నా ఇదే బోధ. ఇవన్నీ కధలు. కేవలం సంకేతాలు. సంకేత మెప్పుడూ సత్యాన్ని

Page 26

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు