#


Index

చిత్రతరంగిణి

చాటుతుంది శాస్త్రం. చైతన్యరూపంగానే ఇది సత్యం గాని దానికి బాహ్యంగా చూస్తే మాత్రం అసత్యమే. బాహ్యంగానే కదా చూస్తున్నాము మనమిప్పుడు. కనుక రజ్ఞుసర్పంలాగా అక్షరాలా ఇది అసత్యమేనని సిద్ధాంతం. దీనితో ఐదవ భ్రమకూడా తొలగిపోయింది.

  ఈవిధంగా మొదటి మూడింటి వల్లా జీవ భేద భ్రమా చివరి రెండింటి వల్లా జగద్భేద భ్రమా - నివృత్తి కావటం మూలాన జీవజగదభిన్నమైన సచ్చిద్రూపమైన ఆత్మాకారమైన కేవల బ్రహ్మ తత్త్వమొక్కటే ఏకైక సత్యమని అనుభవానికి వస్తుంది. ఇలాంటి అఖండాపరోక్ష రూపమైన అనుభవాన్ని ఋభునిదాఘ సంవాదమనే నెపంతో మనకు ప్రసాదిస్తున్నదీ ఉపనిషత్తు. మనం మన జీవితాలన్నీ దానికి భోజనం చేసుకోగలిగితే చాలు. మానవజన్మ ఎత్తినందుకు దాన్ని చరితార్ధం చేసుకోగలుగుతాము.









Page 248

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు