#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
సుందః చలించి నామ రూపాలుగా పరిణమిస్తేనే సుందరుడాయన, వాటికి (సుం) సౌష్ఠవాన్ని (ద) ఇస్తున్నవాడు మరలా తానే.
రత్ననాభః
సులోచనః
విలువైన ఆ గుణరత్నాలన్నీ ఆయనలోనే గుప్తమయి ఉన్నాయి. ఆయన చూపులోనే అవి వెలువడుతున్నాయి.
అర్కః
వాజసనః
శృంగీ
అలా వెలువడిన నామరూపాది గుణాలద్వారానే మన మర్చించ వలసిన తత్త్వమది. అర్చిస్తే ప్రసన్నుడయి (వాజ) బలాన్ని (సన) అనుగ్రహిస్తాడు సాధకుడికి (శృణాతీతి శృంగీ) చీల్చి వేస్తాడు కూడా తాపత్రయాన్ని.
జయంతః
సర్వవిత్ జయీ
సువర్ణ బిందుః
అదే సాధకుడైన వాడికి జయం. సర్వమ్ విష్ణుమయమని దర్శించటమే జయం. సువర్ణం ఓకారం, బిందువు మకారం, రెండూ కలిస్తే ఓమ్. ఓంకార రూపుడు పరమాత్మ. వాచకమూ వాచ్యమూ కూడా. సువర్ణములంటే నామరూపాలు బిందువంటే శూన్యం. నామరూపాలూ పరమాత్మే తద్రహితుడూ ఆయనేనని భావం.
అక్షోభ్యః ఎంత సగుణుడైనా గుణక్షోభం చేత మరలా క్షుబ్ధుడు కాడు.
సర్వవాగీశ్వరేశ్వరః కారణం వాచకమైన ఈ గుణ సృష్టికంతటికీ అధీశుడు వైఖరి నుంచి పరా వరకున్న వాక్కులన్నిటికీ అతీతుడు.
మహాహ్రదః ప్రతిభావమూ దానినుంచే రావాలి కాబట్టి అది చాలా లోతైనది.
మహాగర్తః ఒక పెద్ద అఖాతమది. దిగలేము. అందుకోలేము.
మహాభూతః
మహానిధిః
భూతం కాదది ఇది ఇంత అని నిర్ణయించటానికి. మహాభూతం మహానిధి కూడా. అన్నీ అందులోనే నిహితమయి ఉన్నాయి.

Page 56

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు