నామం | అంతరార్థము |
---|---|
కుముదః కుందరః కుందః |
(కు) తనకు విలోమంగా ఏర్పడ్డ సృష్టిని చూచి ఆనందిస్తాడు. దాన్ని మరలా (దర) విదారణం చేసి తనలో కలుపుకొంటాడు. అలా కలుపుకోమనే మనకది (ద) ప్రసాదిస్తున్నాడు. |
పర్జన్యః పావనః అనిలః |
పరిపరిదేహాలలో జీవులుగా జన్మిస్తూ వారిని సాధకులుగా మార్చి పరిశుద్ధులను చేస్తూ అసలేదీ చేయకుండా అచలస్థితిలో (అన్+ఇల) ఉన్నాడు. |
అమృతాశః అమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః |
ఒక అశనముందాయనకు, దానితో పెరిగే శరీరముంది. అశనం ప్రపంచం. శరీరం చైతన్యం, అయితే మృతంకావు రెండూ-ఎప్పటికీ అమృతమే. అసలీ అశనాదులన్నీ గ్రహిస్తున్న దదే. సర్వతో ముఖమైనదా జ్ఞానం. జ్ఞాతా, జ్ఞానం, జ్ఞేయం మూడూ అదే. |
సులభః సువ్రతః సిద్ధః |
మూడూ అదే గనుక సుళువుగా లభిస్తుంది. కాని దృఢమైన దీక్ష ఉండాలి మనకు. అలాంటి చూపున్న వాడికది సిద్ధమే క్రొత్తగా సాధించవలసింది కాదు. |
శత్రుజిత్ శత్రుతాపనః |
సిద్ధుడైన మానవుడికిక సంసారమనే శత్రువు వల్ల బాధలేదు. దాన్ని జయించగలడు. దానివల్ల తాను తపించటం కాదు. దాన్నే తపింప చేయగలడు. |
న్యగ్రోధోదుంబరః | (న్యక్+రోధ) ప్రతి ఒక్క నిరోధాన్ని క్రిందుపరచి (ఉత్+ఉంబర) అద్భుతంగా పైకి లేచిన తత్త్వమది. అంబరంలాగా స్వచ్ఛమూ నిర్లిప్తమైనది. |
Page 57