నామం | అంతరార్థము |
---|---|
చతుర్వేదవిత్ ఏకపాత్ |
నాలుగు వేదాలుగా అవతరించినవాడు. వాటి ద్వారానే మరలా అందుకోవలసినవాడు. అప్పుడీ నాలుగులన్నీ కలిసి ఏకమే. అది చేర్చేది గాదు. చేరే పాదం లేక పదం (పద్యతే ఇతి) |
సమావర్తః అనివృత్తాత్మా |
అయితే సాధకుడు మిగతా అన్నిటినుంచీ బాగా వైదొలగి దాని నుంచి ఎప్పుడూ తొలగకుంటేనే అది లభ్యం. |
దుర్జయః దురతిక్రమః |
అలాంటి సాధన లేకుంటే ఎప్పుడూ మన కజేయుడే. అనతి క్రముడే ఆ పరమాత్మ. |
దుర్లభః దుర్గమః దుర్గః దురావాసః దురారిహా |
అసలది అందుకోలేము. చేరలేము. పొందలేము. కత్తి వాదర లాంటి దామార్గం. అందులో నడచిపోవటం కష్టమే. గమ్యం చేరటం కష్టమేనంటున్నది శాస్త్రం. చేరటమే కష్టమైతే అందులో మనం వసించటం కలలోని వార్త. మనలో ఉన్న అసుర భావాలను నిర్మూలిస్తే అది ఎప్పటికైనా మన సొమ్మవుతుంది. |
శుభాంగః లోకసారంగః సుతంతుః తంతువర్థనః |
శుభవాసనలే దానినందుకొనే సామగ్రి. లోకంలో సారమేదో అదే దాని స్వరూపం. పూసలలో దారంలాగా సకల విశేషాలను వ్యాపించి ఉన్నదది. సుతంతు. అది గుర్తిస్తే సంసార తంతువు నదే ఛేదిస్తుంది. (వర్ధన) |
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః |
అసలీ సంసారి అయిన జీవుడు (ఇంద్ర) చేసే కర్మలన్నీ ఆయన కర్మలే. ఈశ్వరుడు చేసేవీ ఆయనవే. అసలు క్రొత్తగా చేయటం కాదు. ఎప్పుడో చేసినవే సకలకర్మలూ. చేసినదే చేయటంగా వస్తున్న (ఆగమ) ప్రవాహమిది. |
ఉద్భవః సుందరః |
చలనాత్మకమైన ఈ కలాపమంతా చలనం లేని దాని నుంచి ఉద్భవించినదే. అచలంగా ఉంటే సౌందర్యం లేదు. |
Page 55