నామం | అంతరార్థము |
---|---|
సుమేధాః మేధజః ధన్యః సత్యమేధాః |
జ్ఞానమనేది మూర్తీభవించినవాడు. మేధ అంటే యజ్ఞం. జ్ఞాన యజ్ఞం. చేస్తే జన్మిస్తుంది. ఏమిటి ధనం. దానితో ధన్యులమైతే (సత్య) ఎప్పటికీ నిలిచే జ్ఞాన ధనమవుతుంది. |
ధరాధరః | తన్మూలంగా అన్నిటినీ ధరించే మాయాశక్తిని కూడా ధరించి ధరాధరుడు కాగలడు సాధకుడు. |
తేజోవృషః ద్యుతిధరః |
తన తేజస్సునే జగద్రూపంగా వర్ణిస్తున్న చైతన్యమది. దానినే మరలా అధిష్ఠానరూపంగా ధరిస్తున్నది. |
సర్వశస్త్ర భృతాంవరః |
శస్త్రమంటే విషయజ్ఞానం. అది ధరించినవారు జీవులు. వీరందరికీ వరణీయుడు ప్రార్థనీయుడు ఈశ్వరుడు. నరులక యనమైన వాడు నారాయణుడు. |
ప్రగ్రహః | సర్వశక్తులూ ప్రకర్షంగా పట్టుకొని (గ్రహ) ఉన్నవాడూ. |
నిగ్రహః వ్యగ్రః |
ఎన్ని శక్తులున్నా బయటపెట్టనివాడు. పెట్టాలని సంకల్పిస్తే వివిధ రూపాలుగా బయటపెట్టేవాడూ ఆ పరమాత్మే. |
నైకశృంగః గదాగ్రజః |
అనేక శాఖలుగా ప్రసరించేదా పరమాత్మ చైతన్యం. అంతగా ప్రసరిస్తున్నా (గద) వాక్కుల కందనంత (అగ్ర) ఎత్తులో ఉన్నది. |
చతుర్మూర్తిః చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః |
విరాట్, సూత్ర, అవ్యాకృత, తురీయములనే నాలుగు మూర్తులూ సత్త్వ రజస్తమ శ్శుద్ధ సత్త్వాలనే నాలుగు బాహువులూ వాసుదేవ సంకర్షణాదులైన నాలుగు వ్యూహాలూ-కర్మభక్తి యోగ జ్ఞానాలనే నాలుగు గతులూ కలిగినదది. |
చతురాత్మా చతుర్భావః |
విశ్వతైజస ప్రాజ్ఞ తురీయాలనే నాలుగాత్మలూ ధర్మ అర్థకామ మోక్షాలనే నాలుగు భావాలూ కూడా కలదది. ఋగాదులైన |
Page 54