#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
మహాశృంగః
కృతాంతకృత్
వాటికి కూడా అతీతమైన తురీయమనే శృంగంలో మెలగుతూ-కృతమైన ఈ మొత్తానికి, అంతకృత్ - అంతం చేస్తున్నదదే.
మహావరాహః
గోవిందః
సుషేణః
కనకాంగదీ
అలాంటి పరమాత్మే మహావరాహమై గోవిందః ఈ పృథివితో సాంగత్యం పెట్టుకొని సుషేణ చరాచరాలనే పెద్ద సైన్యాన్ని కని కనకాంగదీ, నామరూపాలనే ఈ కనకమే అంగద ఆభరణాలుగా ధరించాడు. హిరణ్యగర్భుడే మహావరాహం.
గుహ్యః
గభీరః
గహనః
ఈ ప్రవర్తనే ఎవరికీ అంతుపట్టదు. గోప్యమది. చాలా లోతైనది. అంభోనిధి అని గదా నామం, అంభోనిధి గనుకనే గంభీరం. అంత గంభీరమైనదెప్పుడూ గహనమే. మనసుకు కూడా అతీతం. అచింత్యం.
గుప్తః
చక్రగదా ధరః
అంత గుప్తమైనదా పరమార్థం. చక్రంలాగా తిరుగుతోంది మానవుడి మనసు. గదా అంటే చెప్పే మాట. ఆలోచించే మనసు ఆడుకొనే మాట రెండూ ఆయన చేతిలోనివే.
వేధాః
స్వాంగః
అజితః
కృష్ణః
మనమేది చేయాలన్నా ఆయనే విధించాలది. ఆయన తాలుకు అంగమే ఈ మానవుడు. అంగి ఆయన, అంగం మనం, అంగ మెప్పుడూ అంగిని అతిక్రమించి పోలేదు. దీనిచేత జితం కాదది. మీదు మిక్కిలి అదే దీన్ని ఇటూ అటూ లాగగలదు (కృష్ణ).
దృఢః
సంకర్షణః
అచ్యుతః
దృఢంగా లాగగలదు. అటుగాని ఇటుగాని, సాధకులకైతే సంకర్షణుడు. తనవైపే చక్కగా లాగుకొంటాడు. అలా లాగు కొంటే ఇక ఆయనకు లాగా మనకూ చ్యుతిలేదు అచ్యుతులమే.
వరుణః
వారుణః
సాధకులకు కావలసినదంతా వర్షిస్తాడు (వరుణ) మార్గంలో అంత రాయాలేవి వచ్చినా వారిస్తాడు. (వారుణ) తాపత్రయాన్ని

Page 43

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు