#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
స్థవిష్ఠః
అభూః
అన్నిటికన్నా స్థూలమది. దానికన్నా స్థూలం అభూః - నభవతి లేదు. నిత్యసిద్ధమది. అభూః - క్రొత్తగా ఏర్పడేది కాదు.
ధర్మయూపః
మహామఖః
నక్షత్రనేమిః
నక్షత్రీ
ధర్మాచరణతో దాన్ని సాధించాలని చూస్తారు. పెద్ద పెద్ద మఖాలు రాజసూయాదియాగాలు చేస్తారు. నక్షత్ర దానివల్ల క్షతం తొలగి పోయిందని భావిస్తారు. కాని వాటన్నింటికీ నేమి - కేంద్రస్థానమా పరమాత్మేనని ఎరగరు. దాన్ని భావిస్తేనే క్షతానికి దూరమవుతామని కూడా తెలియరు.
క్షమః
క్షామః
సమీహనః
అన్నీ క్షపితమైనా నిలిచి ఉండేదది. కనుకనే మనలను నిలపగలదు. అలా నిలపాలని ఈహ కోరిక నీకు జనిస్తే దానికీ నిన్ను నిలిపే సంకల్పం కలిగి తీరుతుంది.
యజ్ఞః
ఇజ్యః
మహేజ్యశ్చ
అది వదిలేసి చేస్తున్నాము మనం యజ్ఞయాగాదులను. ఈ చేసే యజ్ఞస్వరూపుడా విష్ణువేనని తెలియదు మనకు. యజ్ఞో వైవిష్ణుః - అంతేగాదు. యజ్ఞంచేత ఇజ్యుడు యజింపవలసిన వాడూ ఆయనే. దేవతలు గదా ఇజ్యులంటే వారికి కూడా ఇజ్యుడైన మహేజ్యుడాయన.
క్రతుః
సత్రమ్
సతాం గతిః
యజ్ఞాలే గాదు, సయూపాలైన క్రతువులూ ఆయనే. అవి చేయాలనే (క్రతు) సంకల్పమూ ఆయనే. దీర్ఘసత్రయాగాలూ ఆయనే. వీటన్నింటి ద్వారా శిష్టులైన పెద్దలందుకొనే గమ్యమూ ఆయనే.
సర్వదర్శీ
విముక్తాత్మా
సర్వజ్ఞః
ఇంతెందుకు. సర్వమూ అయి సర్వాన్నీ దర్శిస్తున్నాడా ఈశ్వరుడు. దర్శి గనుకనే దృశ్యంలో చేరిపోడు. దాని నుంచి ఎప్పుడూ విముక్తుడే. దృశ్యమైన సర్వమూ అసలు దృక్కే.

Page 37

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు