#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
జ్ఞానముత్తమమ్ జ్ఞానమే, దృశ్యరహితం గనుక ఆ జ్ఞానమెప్పుడూ ఉత్తమమే. అఖండమే.
సువ్రతః
సుముఖః
సూక్ష్మః
జ్ఞాన స్థితే వ్రతం దానికి. దాన్ని విడిచి ఉండదు. అదే ముఖం దానికి జ్ఞేయాన్ని దర్శించటానికి. జ్ఞానమే జ్ఞేయమయి ఈ జ్ఞేయాన్ని మరలా ఆ జ్ఞానమే దర్శిస్తున్నది. ఇదే అన్నింటికన్నా అతిసూక్ష్మమైన రహస్యం.
సుఘోషః
సుఖదః
సుహృత్
ఈ రహస్యాన్ని ఆగమరూపంగా ఘోషిస్తూనే ఉన్నదది. దాని నర్థం చేసుకొని పట్టుకొనే సాధకుడికది సుఖదమే, సుహృత్తే.
మనోహరః
జితక్రోధః
వీరబాహుః
విదారణః
సుహృత్తు గనుకనే మొదట సాధకుడి మనసును హరిస్తాడు. దానితో క్రోధమనేది తొలగిపోతుంది. క్రోధం రాగానికి కూడా ఉపలక్షణం గనుక రాగద్వేషాలు రెండూ పోతాయని భావం. తన్మూలంగా వీరబాహువయి విదారణ చేయగలడీ రజస్తమో గుణాలను.
స్వాపనః
స్వవశః
వ్యాపీ
స్వమ్ ఆపాదయతీతి స్వాపనః ఆవరణ విక్షేపరూపమైన ఆ రెండింటినీ విదారణ చేసి మన స్వరూపంలోనే నిలుపుతాడు మనలను. మన వశంలో ఉంటామప్పుడు మనం. లేదా ప్రపంచ వశంలో కాక పరమాత్మ వశంలో ఉంటాము. అదే వ్యాప్తి ఈ సాధకుడికి. జీవజగదీశ్వర భేదం నశిస్తేనే నిజమైన వ్యాప్తి.
నైకాత్మా
నైకకర్మకృత్
అలా వ్యాపిస్తే అన్ని దేహాలూ మనవే. ఆత్మ అంటే ఇక్కడ దేహమని అర్థం. అలాగే ఆ దేహాలతో చేసే అన్ని వ్యాపారాలూ మనవే. ఈశ్వర రూపంగా శరీరేంద్రియాదులన్నీ ఒక్కటే అయినప్పుడీ యజ్ఞయాగాదులెవరి కోసం.

Page 38

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు