#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
సమయజ్ఞః
హవిర్హరిః
సమయం తెలుసు దానికి. ప్రారబ్ధం తీరగానే ఈ ప్రాణాదిక మంతటినీ ఒక హవిస్సులాగా హరించి వేస్తుంది. సర్వలక్షణ లక్షణ్యః అందుకే అది హరించే లోపల ఈ జీవుడు సర్వజగత్తునూ లక్ష్మీవాన్ ఒక లక్షణంగా చేసుకొని దీనిద్వారా దాన్ని లక్షించగలగాలి. సమితింజయః అలా లక్షించినవాడే లక్ష్మీవాన్. వాడే ఈ సమితి సంసారమనే యుద్ధంలో జయాన్ని పొందుతాడు.
విక్షరః
రోహితః
మార్గః
క్షరణమంటే జారటం లేదా అపజయం. అది లేనివాడాయన. కనుకనే ఆ లక్ష్యాన్ని పట్టుకొని అంతకంతకు రోహిస్తూ పోతే మార్గమూ ఆయనే, గమ్యమూ ఆయనే, అవుతాడీ సాధకుడికి.
హేతుః
దామోదరః
సహః
మహీధరః
మహాభాగః
వేగవాన్
అమితాశనః
ఉపాదాన నిమిత్తాలు రెండూ పరమాత్మే. కాబట్టి భయంలేదు. దమాదులైన సాధన రహస్యాలన్నీ దాని గర్భంలోనే గుప్తమయి ఉన్నాయి. కనుక సాధించవచ్చు. అయితే సహనంతో చేయాలి ప్రయాణం. చేసి గట్టెక్కితే ఆయనలాగా (మహీ) శక్తి ధరులమే కావచ్చు. మహాభాగ-షాడ్గుణ్యమనే భగం కూడా వశమవు తుంది మనకు. సంసారమనే ఈ ప్రవాహంలో ఉంటూనే జీవుడిలాగా మితంగా కాక అమితంగా దీన్ని అనుభవించ వచ్చు. అనులోమ ప్రతిలోమాలు రెండూ అశనమే జీవన్ముక్తుడికి.
ఉద్భవః
క్షోభణః
జీవుడుగా ఉద్భవించిందీ అదే. సంసారక్షోభ పొందిందీ అదే.
దేవః
శ్రీగర్భః
పరమేశ్వరః
జ్ఞానంతో నిత్యమూ ప్రకాశిస్తున్నదీ అదే. శ్రీ అంటే శక్తి - శక్తి రూపంగా ఈ జ్ఞేయ ప్రపంచాన్నంతా లోగొన్నదీ అదే. అన్నింటినీ అదుపులో ఉంచుకున్న ఈశ్వరుడూ అదే.

Page 33

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు