నామం | అంతరార్థము |
---|---|
కరణమ్ కారణమ్ కర్తా వికర్తా |
ఒక కార్యానికి తోడ్పడే కరణమూ దాని కుపాదానమైన కారణమూ దానికి నిమిత్తమైన కర్తా - దాన్ని ఎప్పటికప్పుడు మార్పు చెందించే వికర్తా అంతా అదే. మరేదీ కాదు. |
గహనః గుహః |
అంతా అదే అయ్యేసరికి దాన్ని అర్థం చేసుకోవటం గహనమవు తున్నది. అంత గంభీరమైనదది (గుహ) |
వ్యవసాయః వ్యవస్థానః సంస్థానః |
అందుకోసం వ్యవసాయ-నిశ్చయాత్మకమైన బుద్ధి కావాలి. అది వ్యవస్థాన గట్టిగా నిలవాలి. సంస్థాన - చెదరకుండా ఒక్కచోట పుంజీకృతం కావాలి. అన్నిటినీ కలుపుకోవాలి. |
స్థానదః ధ్రువః |
ఆసించిన స్థానం లేదా ఫలితాన్ని అందివ్వాలి. అది మరలా చలించకుండా ధ్రువమయి ఉండాలి. |
పరార్ధిః పరమస్పష్టః |
అంత పుష్కలమైనదది. పరమ్+అస్పష్టమ్ అయినా అస్పష్టమే దాని స్వరూపం. ఆత్మరూపంగా భావిస్తే ఎంతో స్పష్టం. పరమ స్పష్టం. |
తుష్టః పుష్టః శుభేక్షణః |
స్పష్టమెప్పుడయిందో తుష్టి పుష్టి కూడా చేకూరుతుంది. అలాంటి శుభాన్ని మానవుడికందించే చూపుగలదా పరమాత్మ చైతన్యం. |
రామః విరామః విరతః |
జీవేశ్వర రూపంగా ఈ సంసారంలో రమించేది అదే, దీని నుంచి విరమించేది అదే. అసలు ఎప్పుడూ విరమించి ఉన్నదీ అదే. |
మార్గః నేయః నయః |
అలాంటి తత్త్వాన్ని చేర్చే మార్గమూ అదే. ఆ మార్గంలో కొనిపోబడే సాధకుడూ అదే, కొనిపోవటమదే, సాధకుడు కాకుంటే అలాంటి లౌకికుణ్ణి కొనిపోవనిదీ అదే, మన |
Page 34