నామం | అంతరార్థము |
---|---|
అధిష్ఠానమ్ | వాసవానుజుడు. జీవుడు చిదాభాసుడైతే ఆయన కూటస్థుడు. కనుకనే అది జన్మకాదు. అపాం పంచభూతాలకూ నిధి నిలయమైన వాడెలా జన్మిస్తాడు. జన్మించేది ఆరోపితమే అధిష్ఠానం కాదు. అధిష్ఠానం పరమాత్మ. |
అప్రమత్తః ప్రతిష్ఠితః |
ప్రమత్తత అంటే పరాకు. అది ఉన్నప్పుడే జన్మ. అది ఎప్పుడూ లేని అప్రమత్తుడాయన. తన ప్రజ్ఞానంలో తానెప్పుడూ ప్రతిష్ఠితుడే. |
స్కందః స్కందధరః |
స్కందుడంటే జారిపడినవాడు. ఈ జారిపడిన జీవుడెవడో కాదు మరలా. వీడిని ధరించిన స్కందధరు డాయనే. |
ధుర్యః | ఈ జీవుణ్ణి కాదు. ఆ మాటకు వస్తే జగత్తును కూడా ధరించిన ధుర్యుడాయన. |
అవరదః | అలా ధరిస్తూనే ఈ అవరమైన శరీరాదులు మనకిచ్చాడు. |
వాయువాహనః | దీనిలో ఈ ప్రాణవాయువును ప్రవహింపజేశాడు. |
వాసుదేవః బృహద్భానుః |
ఈ దేహ ప్రాణాలేమిటో కావు మరలా. వాసుదేవుడనైన నేనేనంటాడు. వసతి దీవ్యతీతి వాసుదేవః - అస్తిభాతి ఉండటం ప్రకాశించటమే వాసుదేవ అంటే, ఉన్నది శరీర ప్రాణాలు. ప్రకాశిస్తున్నది లోపలి చైతన్యం. బృహత్ప్రకాశమది. |
ఆదిదేవః పురం దరః |
ఆదినుంచీ ఉన్నదా ప్రకాశం. పురందర త్రిపురాలనూ దారణం చేసే దీప్తి అది. త్రిపురాలేవో కావు స్థూల సూక్ష్మ కారణ శరీరాలే. |
అశోకః తారణః తారః |
తారణం చేస్తే కారణ శరీరమైన మోహశోకాలు పోతాయి ముందు. వాటితోపాటు పేకమేడలాగా మిగతావీ కూలి పోతాయి. అప్పుడీ జీవుణ్ణది తరింపజేస్తుంది. వీడు తరిస్తాడు. |
Page 31