#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
ఇష్టః
అవిశిష్టః
శిష్టేష్టః
జయించలేక వీటిచేత జితుడైనవాడు నరుడే. వీడిచేత మరలా ఇష్ట వెదకబడుతున్నాడా నారాయణుడు. అలాగని ఈ నరుడి కన్నా విశిష్టుడు కాడు. అవిశిష్టుడే, అభిన్నుడే. ఈ అభేదాన్ని గుర్తించిన శిష్టులే అలా వెదకి పట్టుకోగలరు.
శిఖండీ
నహుషః
వృషః
పట్టుకొని దాన్నే ఒక కిరీటంగా (శిఖండ) ధరిస్తాడు శిష్టుడు. అలా ధరించమనే మౌనంగా మనకు బోధిస్తున్న దాతత్త్వం, అందుకోస మీ సంసారం తోడి తగులం నహి చేసుకొని నహుషుడవు కమ్మంటున్నది. వృష అప్పుడే నిజమైన సుఖాన్ని వర్షిస్తానంటున్నది కూడా.
క్రోధహా క్రో
ధకృత్
కర్తా
అలాంటి ప్రయత్నం చేస్తూ పోతేనే జీవుడి మీద ఆగ్రహం చూపడు. క్రోధం వదిలేస్తాడు. లేకుంటే అంతా ఆగ్రహమే. అంతా మనమీద కోపమే. నిగ్రహానుగ్రహాలకు రెంటికీ కర్త ఆయన.
విశ్వబాహుః
మహీధరః
అంతా మనకివ్వగలడు. విశ్వబాహువులున్నాయాయనకు. ఎంత ఇచ్చినా ఇవ్వవచ్చు. లేదా ఆగ్రహిస్తే ఇవ్వకుండా వెనుకకు తీసుకోగలడా బాహువులు. అప్పుడవి మహీ శక్తిరూపంగా తానే ధరించి ఉంటాడు. వ్యక్తమై బయటపడదు.
అచ్యుతః
ప్రథితః
అసలది స్వరూపంగా అచ్యుతం. తన స్థానం నుంచి తానెప్పు డూచ్యుతి పొందలేదు. పొందకున్నా పొందినట్టు చేసినట్టు ఒక ప్రథ ఏర్పడిందాయనకు. దానితో ప్రథితుడయినాడు.
ప్రాణః
ప్రాణదః
వాసవానుజః
అపాం నిధిః
ఆయన చలిస్తే ప్రాణం. అది ఈ జీవుడి కందజేస్తే ప్రాణదుడు. ఈ జీవుడే శరీరంలో వసించే వాసవుడు. ఈ వాసవుణ్ణి అనుసరించి ఆయనా ఈ శరీరంలోనే జన్మించాడు. కాబట్టి

Page 30

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు