నామం | అంతరార్థము |
---|---|
భూతభవ్యభవన్నాథః పవనః పావనః అనలః |
త్రికాలాలూ ఆ తత్త్వాన్ని మించి లేవు. వాటికదే నాథ న+అథ. దేని తరువాత మరొకటి లేదో అది నాథ. పవనః అది కదలకుండానే కదులుతుంది. పావన-కదిలించకుండానే కదిలిస్తుంది. అలమంటే ఇంత అని పరిమితి. అలాంటి పరిమితి లేనిది అనల పరిపూర్ణమని భావం. |
కామహా కామకృత్ కాంతః |
కదలాలంటే కోరిక ఉండాలి గదా. అలాంటికామమే లేదు దానికి. హా దాని నెప్పుడో వదిలేసింది. అసలులేదు. లేని కామాన్ని కృత్ సృష్టించగలదు. సృష్టించి మరలా అంతమూ చేయగలదు. |
కామః కామప్రదః ప్రభుః |
కామమూ అదే, కామప్రదమూ అదే, కామాన్ ప్రకర్షణ ద్యతి ఛినత్తీతి - ఆకామాన్ని చివరకు త్రుంచి పారేసేదీ అదే. ప్రకర్షణ భవతి - మూడు రూపాలుగానూ ఉండగలదది. |
యుగాదికృత్ | యుగమంటే ద్వంద్వం. ఆది అంటే మొదట. ఈ ద్వందాల నన్నింటినీ సృష్టికి పూర్వం కల్పించిందీ అదే. మరేదీ గాదు. |
యుగావర్తః నైకమాయః మహాశనః |
ఈ ద్వంద్వాలను సృష్టించి మరల వెనుకకు తీసుకొనేదీ అదే. ఒకటిగాదు దాని మాయ. ఎంతైనా ఉంది. మీయతే అనయా-దానితో అన్నిటినీ కొలిచి పారేస్తుంది. మరలా అన్నిటినీ అశన కబలించి వేస్తుంది. |
అదృశ్యః వ్యక్తరూపశ్చ |
చిత్రమేమంటే తాను కనిపించకుండానే అన్ని పదార్థాలనూ కనపడేలా చేస్తుంది మన దృష్టికి. |
సహస్రజిత్ అనంతజిత్ |
వేలూ లక్షలూ ఆ కనపడే రూపాలు, ఒక్కమాటలో అనంతం, అంతం లేదీ నామరూపాలకు. వీటికి తాను వశం కాడు. మరలా వీటినే జయించి వశంలో ఉంచుకొన్నాడు. |
Page 29