×
అధికరణ : ఒక విషయాన్ని చర్చించే సందర్భం Discours.
ఇందులో ఐదు అంశాలు తప్పక ఉండాలి. విషయం, విశయం, సంగతి, ఆక్షేపం, సమాధానం.
అధిష్ఠాన : ఆధారం, ఆస్పదం. Basis. దేనిమీద ఆరోపణ జరుగుతుందో అది. అధిష్ఠానమెప్పుడూ వస్తువే. అంటే సత్యమే. ఆరోపితమే ఆభాస. అదికూడా వస్తువుకు అన్యం కాదు.
వస్తువే మరో రూపంలో భాసిస్తే దానికాభాస అని పేరు. వస్తువుగా అది సత్యం - ఆభాసగా అసత్యం.