అది అఖండమైన భావనలో ఖండమైన తమ చిత్తవృత్తులను హోమం చేసి అఖండంగా మారిపోతుంటాయి.
తాని ధర్మాణి ప్రధమాని ఆసన్. అలాటి ప్రవిలాపన మార్గమే ఇక్కడ అనుసరించవలసిన ధర్మం. సర్వులూ అనుసరించ వలసినది గనుక ధర్మాలని బహువచనంలో చెబుతున్నారు. అవే మన మూలపురుషులు మొదట చేస్తూ వచ్చారు కాబట్టి ప్రధమ ధర్మాలయ్యాయవి. తేహ నాకం మహి మాన స్సచంతే వారందరూ అలా చేస్తూ వచ్చి నందుకు ఫలితమేమిటని అడుగుతారేమో. మహిమానః మహి మాన్వితు లయ్యారు వారంతా. అయి సచంతే అంటి పట్టుకొన్నారు. దేన్ని నాకం. కమ్మంటే సుఖం. అకం అంటే సుఖం కానిది దుఃఖం. న అకం దుఃఖం కూడా కానిది. మరలా సుఖమే. అంటే సుఖదుఃఖాది ద్వంద్వాల కతీతమైన దశ. అదే ఇక్కడ నాకం. మోక్షమని భావం - ముక్తులయ్యారని అర్థం. వీరొక్కరే క్రొత్తగా అయ్యారా. మరెవరూ కాలేదా. కాదు. ఎందరో అయి ఉన్నారీ పాటికే. అలాంటి మహానుభావులు. యత్ర పూర్వే సాధ్యాస్సంతి పూర్వమెంతో మంది సాధించి పొందిన మహసిద్ధే అది.
ఇక్కడ రహస్యమేమంటే మామూలు భౌతికమైన యజ్ఞ మొకడు తాను యజమానుడయి - తాను చేసేది యజ్ఞమని చేస్తాడు.
Page 99