#


Index

చంద్రమా మనసో జాతః - చక్షో సూర్యో అజాయత ముఖా దింద్ర శ్చాగ్నిశ్చ - ప్రాణా ద్వాయు రజాయత

నాభ్యా ఆసీ దంత రిక్షం - శీర్ణో ద్యౌస్సమవర్తత పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా - తథా లోకా నకల్పయన్ -

  చంద్రుడాయన మనసు నుంచి జన్మించాడట. చక్షుస్సు నుంచి సూర్యుడు జన్మించాడట. ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ పోతే ముఖం నుంచి ఇద్దరు జనించారు. ఒకరు ఇంద్రుడు. మరొకరు అగ్ని. అలాగే ప్రాణాద్వాయుః - ఆవిరాట్పురుషుడి ప్రాణం నుంచి వాయువు జనిస్తే నాభ్యా అంతరిక్షం. నాభి నుంచి పుట్టింది అంతరిక్షం. మరి శీర్షిద్యౌః ద్యులోకం శిరస్సు నుంచి పద్భ్యాం భూమిః - పాదాల నుంచి భూమండలం ఏర్పడ్డాయి. పోతే దిశః శ్రోత్రాత్ - దిక్కులన్నీ ఆయన కర్ణద్వయం నుంచి జన్మించాయి. తధా లోకా నకల్పయన్. ఇంతెందుకు. అసలీ భూరాది ఊర్ధ్వా లోకాలూ - అతల వితలాది అధో లోకాలూ అన్నీ ఆదేవతలు ప్రజాపతిని వికల్పిస్తే ఉత్పన్నమయినవే. అంతకన్నా ఏమీ లేదు. ఇదీ ఈ మంత్రాని కున్న దున్నట్టు చెప్పుకొంటే మన కర్ధమయ్యే విషయం.

  కాని ఇప్పుడు ప్రశ్నే మంటే. ఇంతకు ముందు బ్రాహ్మణుడే ఆయన ముఖమని క్షత్రియుడే బాహువులనీ వర్ణించాడు మీకు గుర్తుందో లేదో. అప్పుడు బ్రహ్మ క్షత్రాదులాయన అవయవాలే నని పేర్కొన్నాడే దాని వాటి నుంచి వీరు జన్మించారని చెప్పలేదు.

Page 88