#


Index

  అలా కనిపించే గుణం శక్తి రూపంగా దానికే ఉంది కాబట్టి అదే వ్యక్తమై ఒక శరీరంగా అవయవాలుగా భాసిస్తున్నది.

బ్రాహ్మణోస్యముఖ మాసీత్ - బాహూ రాజన్యః కృతః - ఊరూ తదస్యయ ద్వైశ్యః - పద్భ్యాం శూద్రో అజాయత

  ముఖాదులైన అవయవా లేవంటా రింతకూ. ఏవో గాదు. బ్రహ్మణుడే ముఖమాయనకు. బాహూ రాజన్యః - క్షత్రియు డాయన బాహువులు. ఊరూ వైశ్యః - వైశ్యుడే ఊరువులు. పద్భ్యాం శూద్రః శూద్రుడే పాదాలు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులనే నాలుగు వర్ణాలూ ఆ ప్రజాపతి నాలుగవయవాలట. ఏమిటర్ధం. ముఖం జ్ఞానానికీ. బాహువులు బలానికీ ఊరువు లాదాన ప్రదానాలకూ పాదాలు సర్వత్రా సంచరించటానికీ సంకేతాలు. ప్రతి మానవుడికీ ఈ నాలుగు లక్షణాలూ ఉండవలసిందే. అప్పుడే పరిపూర్ణత జీవితానికి. ఇవి మనకు మూలపురుషుడైన ప్రజాపతి వల్లనే సంక్రమించాయని చెప్పటాని కాయనకే వీటి నవయవాలుగా ఆరోపించి చెబుతున్నది మంత్రం. అంతే గాని వర్ణ భేదాన్ని బోధించటానికి గాదు. అలాటిదే ఉద్దేశమైతే మిగతా అవయవాల నిలా ఏకరువు పెట్టదు మరలా వినండి ఏమంటుందో.

Page 87