#


Index

  అంటే భూ సంబంధి అయిన ఆలోచన చేశాడు. ఆయన జ్ఞానంలో కలిగిన ఆ వృత్తి జ్ఞేయమైన భూమిగా అవతరించిందట. అప్పటికి నామమే రూపంగా మారి మనకిలా బయట పడి కనిపిస్తున్న దన్న మాట. మనం కూడా చూడండి. ఒకటి మనసులో సంకల్పిస్తాము. ఆ తరువాత దానికి సంబంధించిన పదార్ధాన్ని బాహ్య ప్రపంచంలో చూస్తాము. తత్సంబంధమైన ఆలోచన కలుగుతుంది. ఆ పదార్ధం గోచరించదు. కనుక ఆలోచనా రూపమైన నామమే ముందు. తరువాతనే దాని పరిణామమైన రూపం. అందుకే మొదట నామమే సృష్టి అయింది ఋగాది మంత్ర రూపంగా. నామ సృష్టిని చెప్పి ఇప్పుడిక రూప సృష్టిని వర్ణించి చూపుతున్నాడు. ఏమని.

తస్మా దశ్వా అజాయంత - యే కే చోభయా దతః - గావోహ జజ్జరే తస్మా - త్తస్మా జ్ఞాతా అజావయః -

   తస్మాదశ్వాః - ఆ ప్రజాపతి జ్ఞానంలో నుంచే తరువాత వరుసగా చరా చర పదార్ధాలన్నీ జన్మించాయి. అశ్వములంటే గుఱ్ఱాలు. యేకే చోభయా దతః - పై వరుసా క్రింది వరుసా రెండు వైపులా పండ్లున్న ప్రాణులు. మానవులు మొదలైన వారు. జంతువులలో కూడా అలాంటి జంతవులు. అలాగే గావోహ జజ్జరేతస్మా త్తస్మా జ్జాతా అజావయః -గోవులూ జన్మించాయి. అంతేగాక అజ మేకలూ అవి గొట్టెలూ కూడా పుట్టుకొచ్చాయి.

Page 85