చరా చర పదార్ధాలు ఇవి గదా ప్రపంచం. భౌతికమైన ప్రపంచం పుట్టిందని చెప్పి తరువాత గదా వైజ్ఞానికమైన వాఙ్మయం సృష్టి అయిందని పేర్కొన వలసింది. అది పోనిచ్చి వరస తప్పి చెబుతారేమిటి శాబ్దకమైన సృష్టే మొదట జరిగిందని. అలా చెప్పటమే వరస. అదే సబబు. ఎలాగంటే శబ్దమంటే నామం. అర్థమంటే రూపం శబ్దార్ధాలంటే నామరూపాలే. నామరూపాలలో నామమే మొదటిది. రూపం కాదు. నామం చెబితే మనకు రూపమనేది స్ఫురిస్తుంది. నామ మంటే ఏదో గాదు మరలా. నోటితో ఉచ్చరించే శబ్దం కాదు. ఉచ్చరించక ముందే మనసులో ఏర్పడే ఆలోచనే నామం. చిత్త వృత్తి అంటారు. జ్ఞానం కదిలితే అది వృత్తి. అనాహతమైన Inarticulate శబ్దమది. భావరూపంగా ఉంటుంది. పరమాత్మ జ్ఞానం మొదట ఆలోచనా రూపంగా ప్రసరిస్తుంది. ఆ ఆలోచన కనుగుణంగా చరా చర పదార్ధాల నాయన సృష్టిస్తూ పోతాడు. అది ప్రణాళిక. ఇది బాహ్యమైన ప్రక్రియ.
అందుకే శాస్త్రంలో కూడా వాగు త్సృష్టా స్వయంభువా ఆదౌ వేదమయీ దివ్యా - యత స్సర్వాః ప్రవృత్తయః అని పేర్కొన్నారు. వేద శబ్దేభ్య ఏవాదౌ నిర్మమే స మహేశ్వరః అని మనువు కూడా అంటాడు. సభూరితి వ్యాహరత్ సభూమి మసృజత అని వేదం చెబుతున్నది. ఆ సృష్టి కర్త భూః అనే శబ్ద ముచ్చరించాడట.
Page 84