#


Index

  భౌతికం కాదది. అలాటి ఆలోచనా రూపమైన యజ్ఞం నుంచి జన్మించాయట. ఋచ స్సామాని. ఋగ్వేద మంత్రాలూ సామవేద మంత్రాలూ జజ్జరే. అంటే జన్మించాయి. అంతే కాదు. యజుస్తస్మా దజాయత. యజుర్వేదం కూడా అందులో నుంచే ఆవిర్భవించింది. మరి అధర్వ వేదమో. అది చెప్పలేదేమిటి. ఋగ్య జుస్సామాలే. అసలు వేదాలు. కనుకనే వేదాలకు త్రయీ అని పేరు వచ్చింది. త్రయ అంటే మూడని అర్థం. ఋగాదులు మూడే వేదాలని అభిప్రాయం. అయితే అధర్వం వేదం కాదా అంటే ఋగాది మంత్రాలే చాలా వరకందులో కూడా కనిపిస్తాయి. కాబట్టి ప్రత్యేకించి దాన్ని పరిగణించ లేదు.

  అయినా అది కూడా వేదమే గదా అని ప్రశ్న వస్తే దానికి జవాబు చెబుతున్నారు ఛందాంసి జిజ్జరే అని. మిగతా ఛందస్సులు కూడా అందులోనే ఉత్పన్న మయినాయని చెప్పటంలో అధర్వమనే నాలుగవ వేదం కూడా కలిసి వచ్చిందని భావించవచ్చు. ఛందాంసి అనటం వల్ల గాయత్ర్యాది సప్త విధ చ్ఛందస్సులను కూడా కలుపుకొని చెప్పినట్టు కూడా అర్థమవుతున్నది.

  అంతా బాగానే ఉంది గాని పారమేశ్వరమైన జ్ఞాన యజ్ఞంలో నుంచి మొదట ఋగాది వాఙ్మయం పుట్టిందని పేర్కొనట మేమిటి.

Page 83