వాయవ్యాన్ ప్రాణ వాయువుతో కూడినవివి. జీవులని అర్థం. ఎక్కడ ఉంటాయి. ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే - అరణ్యాలలో గ్రామాలలో క్రూరంగా సౌమ్యంగా బ్రతుకు సాగిస్తున్నవి ఏవి ఉన్నాయో అవి. ఈ జీవ జగత్తులుగా ఖర్చయి పోయిందదే. కనుకనే సృష్టి కర్తే సృష్టి కూడానని చాటుతున్నది బృహదారణ్య కోపనిషత్తు. సోవే దహం వావ సృష్టి రస్మి అహం హీదం సర్వ మసృక్షి. ఇదంతా నేనే సృష్టించాను గనుక ఇది నేనే నని అర్థం.
అయితే చరా చరాత్మకంగా సృష్టి జరిగిందంటున్నారే అది వివర్త రూపంగా జరిగినా సృష్టి సృష్టే గదా. సృష్టి కర్తే సృష్టి అయినా సృష్టే అది. మరి దీనికొక క్రమమంటూ ఉండాలి గదా. Method in Mad-ness అంటారు పెద్దలు. ఒక క్రమం చెప్పు కోవాలి మనం. లేకుంటే మనకు తృప్తి లేదు. కాబట్టి సృష్టి ఏ క్రమంలో జరిగిందో కొంచెం చెబుతారా అంటే చెబుతున్నారు. ఆలకించండి.
తస్మా ద్యజ్ఞాత్సర్వహుతః - ఋచ స్సామాని జజ్ఞరే ఛందాంసి జజ్జరే తస్మా - ద్యజు స్తస్మా దజాయత -
సర్వమూ హుతమైన మహాయజ్ఞమది. ఏమిటది. ఆది కర్త అయిన ప్రజాపతి స్వరూపం. అదే యజ్ఞం. మానస యజ్ఞం. ఆయన సంకల్పమే ఆలోచనే ఒక యజ్ఞం.
Page 82