శ్రీ సూక్త-మంత్రార్థము
మనమింతకు ముందు సంధ్యా వందన వ్యాజంతో గాయత్రీ మంత్రార్థం చెప్పుకొన్నాము. పోతే ప్రస్తుతం దానికి సహోదరమైన శ్రీ సూక్త మంత్రార్థం చెప్పుకోవలసి ఉన్నది. ఏది గాయత్రి అంటున్నామో అదే శ్రీ. ఏది శ్రీ అంటున్నామో అదే గాయత్రి. రెంటికీ తేడా లేదు. శ్రీ అంటే ఆశ్రయించేది అని అర్ధం. ఏది ఆశ్రయించింది. దేన్ని ఆశ్రయించింది. పరమాత్మ చైతన్యాన్ని ఆయన శక్తి ఆశ్రయించింది. నిత్యమూ అంటి పట్టుకొని ఉన్నది. దాన్ని విడిచి ఇది లేదు. దీన్ని విడిచి అది లేదు. రెండింటికీ అవినాభావ సంబంధం. శక్తి శక్తి మతోర భేదః అన్నారు. శక్తికీ ఆ శక్తిని ధరించిన వాడికీ భేదం లేదు. సూర్యుడికీ ఆయన ప్రకాశానికీ భేదముందా. అలాగే శివశక్తులకు అంతరం లేదు. శివ స్వరూపాన్ని ఎప్పుడూ అంటి పట్టుకొని కూచున్నది కనుకనే శక్తిని శ్రీ అన్నారు.
Page 8