ఈ గొప్ప సంకల్పంతోనే శ్రీ సూక్తం మొదలు మంత్రపుష్పం వరకూ వాటి రహస్యార్ధాన్ని వివరించాలని మంత్రాలను వ్యాఖ్యానిస్తూ వచ్చాను. వ్యాఖ్యానం వ్రాసేటప్పుడక్కడా పూర్వులు రచించిన అర్ధ తాత్పర్యాలు కొంత తోడ్పడినా ప్రధానంగా నాకు మొదటి నుంచీ అలవడిన అద్వైత విజ్ఞాన బలమే చివరిదాకా ప్రేరణ ఇస్తూ వచ్చింది. ఇంతకూ నాకున్న అల్పమైన సంస్కృత భాషా జ్ఞానమూ - తర్క వేదాంత విజ్ఞానమూ - లోకానుభవమూ - దీని ద్వారా సద్వినియోగమైతే అదే నాకు పదివేలు. అన్నిటినీ మించి సకల మంత్రాలకూ అధి దేవత అయిన ఆ పరమాత్మ చైతన్య శక్తి నా మనసులో చేరి నన్ను ముందుకు నడిపితే - అదే మీ అందరికీ నాద్వారా సంతృప్తిని ప్రసాదిస్తే అంతకన్నా లక్ష రెట్లు కోటి రెట్లు మహానందం నాకు.
ఇతి
శ్రీ పురుషోత్తమ సేవాభిలాషీ
శ్రీనివాస మనీషీ
Page 7