సత్త్వర జస్తమో గుణాలే త్రిగుణాలు. అవే సాంకేతికంగా Symbolic చెబితే ఋతువులు. వాటిలో వసంతమనేది సత్త్వ గుణం. గ్రీష్మం రజస్సు. శరత్తు తమస్సు.
కాగా ఇక సప్తా స్యాసన్ పరిధయః యజ్ఞ కుండానికి నలువైపులా నాలుగు హద్దులు రేఖాకారంగా ఉంటాయి. అవే పరిధులు. ఎన్ని అవి. సప్త ఏడట. అనుష్టుప్ త్రిష్టు భాదులైన ఏడు ఛందస్సులని బాహ్యార్ధం. ఏడంటే ఇక్కడ లక్ష్యార్ధం చెప్పుకొంటే మనస్సూ ప్రాణమనే అంతరింద్రియాలు రెండూ - చక్షురాదులైన బాహ్యేంద్రియా లైదూ కలిసి ఏడింద్రియా లవుతాయి. ఇవి త్రిస్సప్త - త్రిగుణాల చేత గుణిస్తే ఇరవయి ఒకటవుతాయి. త్రిస్సప్త అంటే ఇరవయి ఒకటి. సమిధః కృతాః ఇవి సమిధలయి పోతున్నాయా యజ్ఞంలో. అంటే అప్పటికీ కాల్పనికమైన యజ్ఞంలో పురుషుడూ ఆయన శక్తీ దాని గుణాలూ సమస్తమూ ఆహుతి కావలసిందే. ఖర్చయి పోవలసిందే. లేకుంటే అభౌతిక తత్త్వం భౌతికంగా మారలేదు. బహుస్యాం ప్రజాయేయ అని గదా ఉపనిషత్తు. పరమాత్మ తాను దీన్ని సృష్టించాడనే గాక తానే ఇది అయిపోవాలను కొన్నాడట.
పోతే దేవా యద్యజ్ఞం తన్వానా అబధ్నన్ పురుషం పశుం జ్ఞానులైన మహర్షులు చేసే మానస యజ్ఞం.
Page 76