#


Index

  అందులోనే ఒక భాగమీ క్రింద మనం చూచే ఈ ప్రపంచంగా కనిపిస్తున్నదనే మాటా కరెక్టే. రెండూ వాస్తవ మయినప్పుడు అక్కడా ఇక్కడా పైనా క్రిందా అనే తేడా ఎందుకు వచ్చినట్టు. తేడా లేదు వాస్తవంలో. ఎందుకంటే పైనా క్రిందా అదే ఉందని ఎప్పుడు పేర్కొన్నామో అప్పుడది పైనే ఉంది క్రింద లేదని గాని క్రిందనే ఉంది పైన లేదని గాని ఏక దేశాన్ని భావిస్తే పొరబాటు గదా.

  మరేమిటంటారు. సర్వత్రా అదే ఉన్నట్టు చూడాలి. అందుకే చెబుతున్నాడు మరలా. తతో విష్వజ్ వ్యక్రామత్. అన్ని వైపులా అదే వ్యాపించి ఉందని. అన్నివైపులా అదే అనే అభిప్రాయ మున్నప్పు డొక వంతు క్రిందా మూడు వంతులు పైనా అని ఎందుకన్నారు. నీవు నీ బుద్ధి కతీతంగా ఎంతో ఉన్నదని - బుద్ధితో పట్టుకొనేది కొంతేనని ఈ సృష్టిని చూస్తున్నావు. కాబట్టి ఇలాటినీ భ్రాంతిని పోగొట్టటాని కిక్కడ నీవు చూస్తున్నది కొంచెమే సుమా - మిగతా నీవు చూడవలసిన దెంతో ఉన్నదీ సృష్టి - అని నీకు జ్ఞానోదయం కలిగించటానికి చెప్పిన మాట అది. కార్య జగత్తే కనపడుతుంటుంది మన కంటికి మామూలుగా. దీనికి కారణమేదో అది దృష్టికి రాదు. మరుగుపడి ఉంటుంది. దీన్ని బట్టి దాన్ని క్రమంగా విచారణ చేస్తూ పోతే గాని అది గోచరం కాదు.

Page 70