#


Index

  సర్వం వస్తు సదాత్మ నా సత్యం స్వతస్తు అనృత మేవ అన్నారు భాష్యకారులు. నీడ స్వతహాగా సత్యం కాదు. మన శరీరమే అలా కనిపిస్తున్నదని చూస్తే సత్యం. అలాగే చైతన్య చ్ఛాయగా ఈ ప్రపంచం మిధ్య. చైతన్యంగా తథ్యం. కనుక మృతమని పేర్కొన్నా ఇబ్బంది లేదు. అన్యోన్య వైరుధ్య మంత కన్నా లేదు. రెండూ వస్తువు Actual లైతే వైరుధ్యం గాని ఒకటి వస్తువయి వేరొకటి ఆభాస అయితే లేదు. ఏతా వతా ముందు చెప్పిన దేశ కాలాలే గాక సమస్త భూతాలూ పరమాత్మే నని వర్ణించటం వల్ల దేశ కాల వస్తువులనే మూడింటినీ పరమాత్మే వ్యాపించాడని చెప్పినట్టయింది. అంతేగాక అవి కూడా పురుష స్వరూపానికి అన్యం కావని నిరూపించటం వల్ల పరమాత్మ తప్ప సృష్టిలో మరేదీ లేదనే ఏకాత్మ భావం లేదా సర్వాత్మ భావం మనకు స్పష్టంగా బోధ పడుతున్నది. ఇప్పుడంతా కలిపి ఒకే ఒక నారాయణ స్వరూపంగా వాచా బయట పెడుతున్నదీ మంత్రం.

త్రిపా దూర్ధ్వ ఉదై త్పురుషః - పాదో స్యేహా భవా త్పునః - తతో విష్వజ్ఞ్యక్రామ - త్సాశనా నశనే అభి

  త్రిపాదూర్ధ్వ ఉదైత్ - మూడు భాగాలా నారాయణ స్వరూపం పైన ఎక్కడో మన బుద్ధుల కందకుండా ఉందని గదా చెప్పాము. అందకుండా ఉందని చెప్పిన మాటా కరెక్టే. అలాగే పాదోస్య ఇహా భవాత్.

Page 69