#


Index

  అది ఈ ప్రపంచంలాగా నామరూపాత్మకమైనది కాదు. జీవుడి లాగా దీనిచేత తిరోహితమైన చైతన్యమూ కాదు. అతి రోహితం. దీని క్షేత్రాన్ని అతిక్రమించి దీనికి విలక్షణంగా ఉన్నది. అయితే ఈ దేశకాలాలు రెండింటి స్వరూపమూ అదే నన్నారు గదా. దీనితో చేతులు కలిపినప్పుడు దీని ప్రభావం దాని మీద పనిచేయదా. ఏ మాత్రమూ చేయదు. కారణం.

ఏతావా నస్య మహిమా - అతో జ్యాయాంశ్చ పూరుషః - పాదోస్య విశ్వా భూతాని - త్రిపాదస్యా మృతం దివి -

  ఏతావా నస్య మహిమా- ఇదంతా ఏదో పరాయిది గాదు దానికి. దాని మహిమే ఇది. మహత్త్వమే మహిమ. విస్తార Expansion మని అర్థం. దీన్నే విభూతి అని కూడా పేర్కొనవచ్చు. వివిధ రూపాలుగా విస్తరించి కనిపించే దేదో అది విభూతి. సౌరమండలమే విస్తరించి కనిపిస్తే ఆ ప్రకాశం దాని విభూతి. విభూతి స్వరూపాన్ని ఏమీ చేయదు. చేయలేదు కూడ. ఎందుకంటే అదే ఇది. అంటే ఈ దేశ కాల వస్తు రూపంగా వ్యాపించిన దంతా అదే. ఆ పురుష తత్త్వమే.

  అయితే ఇలా వ్యాపించిందన్న మాత్రాన ఈ మేరకే అది ఆగిపోయింది - ఇక్కడికే సమసి పోయిందని మరలా అపోహ పడరాదు. ఇక్కడికే పరిచ్ఛిన్న మయి పోలేదట. మరేమిటంటారు. అతోజ్యాయాంశ్చ పూరుషః - దీన్ని మించి దీని కదనంగా కూడా ఉన్నదా తత్త్వం.

Page 64