#


Index

  అంతేకాదు. ఇంతవరకూ వర్ణించిన దాన్ని బట్టి దేశమంతా పురుషుడే వ్యాపించి ఉన్నాడని తెలుసుకొన్నాము. ఒక్క దేశమే గాదు. కాలాన్ని కూడా వ్యాపించి ఉన్నాడా పురుషుడు. పురుష ఏవేదగం సర్వం. ఈ సర్వమూ పురుషుడితోనే నిండి పోయింది. నిండటమే గాదు. ఇదంతా పురుషుడే అసలు. ఏమిటా ఇది. కాలం యద్భూతం యచ్చ భవ్య మంటున్నాడు. భూత భవిష్యత్తులు రెండూ అటూ ఇటూ నిండి పోయి ఉన్నాడు. అవి రెండూ కూడా అదే తత్త్వం. ఇటూ అటూ అన్నప్పుడు మధ్యమే మయింది. మధ్యమంటే వర్తమానం. ఇటూ అటూ అన్నప్పుడు మధ్యం మాత్రమది గాదా. మధ్యలో ఉండే గదా వ్యాపిస్తా డిరువైపులా. అప్పటికి భూత భవిష్య ద్వర్తమాన రూపంగా కనపడే కాలమంతా పురుషుడే.

  ఇంకా ఎలా ఉన్నాడా పురుషుడు. త్రికాలాలూ వ్యాపించి త్రికాలాలూ తన స్వరూపమే కాబట్టి ఉతామృత త్వస్య ఈశానః అమృతత్వమనేది అతని అధీనంలో ఉన్నది. అంటే అతడమృతుడు. ఎప్పటికీ నిలిచి ఉంటాడు. కాలమతని మీద పని చేయదు. కాలాని కీశ్వరుడయిన వాడి మీద కాలమెలా చేయి చేసుకోగలదు. నామ రూపాత్మకమైన ప్రపంచమనే అన్న మొకటి ఉంది గదా. దానిచేత పరిచ్ఛిన్నుడు కాడా అంటే యదన్నే నా తిరోహతి ఈ అన్నం. దాన్ని తిరోహితం చేయదు. మరుగు పరచదు.

Page 63