#


Index

  ఆధారం నారాయణ. జీవ జగత్తులు రెండూ అందులో నుంచే గదా వచ్చాయి. వచ్చాయంటే దాని వివర్తమే - దాని ప్రకటమైన రూపమే ఇది అని అర్థం. ఇలా వచ్చినట్టు కనిపించే ఈ ఆభాసను పట్టుకొని మరలా మన బుద్ధి తదభిముఖంగా సాగిపోవాలి. కాబట్టి అదీ అయనమే. అయన మంటే ఇక్కడ గమ్యమని అర్థం. రెండు విధాలా సరిపోతుందీ మాట. ఇంతకూ సోపాధికమైన ఈ రూపం ద్వారా నిరుపాధికమైన ఆ తత్త్వాన్ని ఎలా అందుకోవాలో ఆ విధానాన్ని జాగ్రత్తగా వినండి.

ఓమ్ సహస్ర శీర్షా పురుష - స్సహ స్రాక్ష స్సహస్రపాత్ - స భూమిం విశ్వతో వృత్వా- హ్యత్యతిష్ఠ ద్దశాంగుళమ్ -

  ఓంకారంతో మొదలవుతున్నది మంత్రం. ఓమ్మంటే సోహం. అదే ఇదీ అని అర్థం. అదే గదా ఈ రూపంలో భాసిస్తున్నది. ఎవరా అది. ఏమిటా రూపం. వర్ణిస్తున్నాడు. సః ఆ పూర్ణమైన నిరాకారమైన తత్త్వమే అది అంటే. నిరాకారమైన ఆ పురుష తత్త్వమే ఇప్పుడీ రూపంలో కనిపిస్తున్నది. ఏమిటా రూపం. ఒకటి గాదు. వేలకు వేల శిరస్సులు దానికి. వేలకు వేల అక్షులు. అలాగే వేలకు వేలు పాదాలు. అన్ని వేల అవయవా లెప్పుడు చూచాము దానికి. చూచినట్టు చేసినట్టు పేర్కొంటున్నారే అంటే దాని కున్నాయని గావివన్నీ. ఇవన్నీ ఉన్నవి మనబోటి జీవులకు, కోటాను కోట్లున్నారు గదా ఈ జీవులు.

Page 60