#


Index

పురుష సూక్త

రహస్యార్థము

  శ్రీ సూక్త రహస్యాన్ని గ్రహించాము. ఇక పురుష సూక్త తాత్పర్య మేమిటో గ్రహించ వలసి ఉంది. శ్రీ పురుష - ఇవి రెండే ఉన్న తత్త్వాలు. తత్త్వమంటే ఏది పోయినా ఎప్పటికీ నిలిచి ఉండేదేదో అదీ. అలాంటివి రెండే ఉన్నాయి. ఒకటి చైత్యన్యం. మరొకటి దాని శక్తి. దాని శక్తి ఏదో గాదు దాని స్థితే. వీటికే చితి స్థితి అని పేరు పెట్టారు అద్వైతులు. స్వరూప విభూతులని జ్ఞానైశ్వర్యాలని వస్తువూ దాని విభూతి అని ఆత్మా నాత్మలని ప్రకృతి పురుషులని వీటికే ఎన్నో ఉన్నాయి నామాంతరాలు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి అని భగవద్గీత రెండింటినీ అనాది అని వర్ణించింది. రెండ నాదు లుంటాయా అని అడిగితే మత్తః పరతరం నావ్య త్మించి దస్తి అని ఆ భగవానుడే చాటుతున్నాడు. శక్తి శక్తి మతో రభేదః - శక్తికీ శక్తిమంతుడికీ ఎప్పుడే గాని తేడా ఉండబోదు. సూర్యమండలం పురుష తత్త్వమైతే దాని ప్రకాశం శక్తి తత్త్వం.

Page 57