ఇదంతా కేవలం దాని భాసే. ఆ భాస అని విద్యా రూపిణి అయి మరలా మనకుపదేశిస్తుంది. పరమే వ్యోమన్. అలాటి జ్ఞాన బలసంపన్నులం కాగలిగితే తప్పకుండా మనమెప్పటి నుంచో దూరమయి పోయామనుకొన్న పరిపూర్ణ చిదాకాశాన్నే అందుకొని అందులోనే శాశ్వతంగా నిలిచిపోగలం.
ఓమ్
శాంతి శ్శాంతి శ్శాంతిః
అంతకన్నా మానవుడు తన జీవితానికి కోరదగిన శాంతి ఏమున్నది. ఆధ్యాత్మికాధి భౌతికాధి దైవికములనే త్రివిధ తాపాలూ శాంతించినట్టే. సంసారమనే భ్రాంతి పూర్తిగా తొలగినట్టే. సర్వాత్మ భావమనే దివ్యకాంతి దేదీప్యమానంగా మనకు లభించినట్టే. ఫలశ్రుతి వ్యాజంతో చేసిన ఈ వర్ణన అంతా ఒక విధంగా మానవుడికి చేసే బోధన అనుకోవచ్చు. మరొక విధంగా దాని సాధన అనుకోవచ్చు కూడా. పరమ సిద్ధి ప్రతిపాదన అనుకొన్నా అనుకోవచ్చు. ఏమనుకొన్నా అదంతా అద్వైతానుభవమే అపరోక్ష జ్ఞాన వైభవమే.
Page 56