తమ స్వానుభవానికి తెచ్చుకొన్నప్పుడు వారేది మాటాడినా ఆవాక్కులో శుశ్రూషువులైన మనబోటి వారికి మేలు చేసే లక్ష్మి నిహితమయి ఉంటుంది. లక్ష్మి అంటే ఏమని చెప్పాము. పరతత్త్వాన్ని చేర్చే అఖండాకార వృత్తి అని గదా చెప్పాము. అది వారి వాక్కే మనకందిస్తుంది. ఆ వాక్కుకు శక్తి వారి నిర్వికల్పమైన చిత్తవృత్తి వల్లనే సంక్రమించింది. అది వారెంత గానో ధారణా ధ్యానాదులు చేసి పదును పెట్టుకొంటేనో అలవడిందని భావం.
ప్రణో దేవీ సరస్వతీ - వాజేభి ర్వాజినీ వతీ - ధీనా మవి త్రవతు
అలాంటి మహనీయుల బోధలు విని తద్వారా పరమ పద ప్రాపకమైన ఆ మహాలక్ష్మిని ప్రసన్నను చేసుకొంటే చాలు. ఈ సాధకుడి కది సరస్వతి కాగలదు. సరస్వతి అంటే అర్ధం చెప్పామింతకు పూర్వం. మరలా మానవుడి చిత్త వృత్తి నసలైన గమ్యాని కభిముఖంగా ప్రసరింప జేసేదని. అది వాజినీవతి. అతి వేగవతి. వికల్పాలను త్రోసి పుచ్చే కొద్దీ వేగంగా తీసుకెళ్లుతుంది గమ్యాభి ముఖంగా. మన దగ్గరున్న ఇంద్రియ వృత్తులన్నీ కూడా తదభి ముఖంగా శీఘ్ర గతితో ప్రయాణం చేస్తాయి. మన బుద్ధులన్నింటినీ కంటికి రెప్పలాగా కాపాడుతూ పోతుందది. అలాటి స్వభావమున్నది గనుకనే ఆ అఖండ వృత్తి మనకు అవిత్రి అయి అవతు. రక్షణ కల్పించాలని శ్రద్ధాభక్తులు సడలకుండా ధ్యానిస్తూ పోవాలి మనం.
Page 54